ఎట్టకేలకు కదిలిన కార్పొరేషన్‌ యంత్రాంగం

ABN , First Publish Date - 2021-04-20T06:25:54+05:30 IST

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ యంత్రాంగం ఎట్టకేలకు కదిలింది. కరోనా వ్యాప్తి నివారణకు ఎట్టకేలకు కార్యాచరణ ప్రారంభించింది. ‘కరోనాపై కార్యాచరణ ఏది’ అనే శీర్షికన సోమవారం ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది.

ఎట్టకేలకు కదిలిన కార్పొరేషన్‌ యంత్రాంగం
రామగుండం పట్టణంలో ఫాగింగ్‌ చేస్తున్న సిబ్బంది

- డిసిన్ఫెక్షన్‌ ప్రక్రియ ప్రారంభం

- ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 19: రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ యంత్రాంగం ఎట్టకేలకు కదిలింది. కరోనా వ్యాప్తి నివారణకు ఎట్టకేలకు కార్యాచరణ ప్రారంభించింది. ‘కరోనాపై కార్యాచరణ ఏది’ అనే శీర్షికన సోమవారం ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. కార్పొరేషన్‌లో పాలన వ్యవహారాలు గాడి తప్పుతుండడంపై అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు, విపక్ష నాయకులు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో కార్పొరేషన్‌ పారిశుధ్య విభాగం కార్యాచరణ ప్రారంభించింది. ఉదయం నుంచి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కొవిడ్‌ భారిన పడిన బాధితుల నివాసాల పరిసరాల్లో హై పో క్లోరైడ్‌ ద్రావణాన్ని చల్లించారు. సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో ఫాగింగ్‌ చేయించారు.

Updated Date - 2021-04-20T06:25:54+05:30 IST