పత్తి పంట కొనుగోలు ముమ్మరం

ABN , First Publish Date - 2021-01-11T05:14:41+05:30 IST

ఈ ఏడాది పత్తి కొనుగోలు ప్రక్రియ ఊపందుకుంది. రాజాం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో పత్తి కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 1065.08 కింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. గత ఏడాది కేవలం 134 మంది రైతుల నుంచి 1,791 క్వింటాళ్లు కొనుగోలు చేసిన అధికారులు ఈ ఏడాది నిర్ణయించిన లక్ష్యం సాధించే దిశలో చర్యలు చేపట్టారు.

పత్తి పంట కొనుగోలు ముమ్మరం
విక్రయానికి వచ్చిన పత్తిని పరిశీలిస్తున్న అధికారులు


ఇప్పటి వరకు 1065.08 క్వింటాళ్ల కొనుగోలు

 గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న అధికారులు

(రాజాం)

ఈ ఏడాది పత్తి కొనుగోలు ప్రక్రియ ఊపందుకుంది. రాజాం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో పత్తి కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 1065.08 కింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. గత ఏడాది కేవలం 134 మంది రైతుల నుంచి 1,791 క్వింటాళ్లు కొనుగోలు చేసిన అధికారులు ఈ ఏడాది నిర్ణయించిన లక్ష్యం సాధించే దిశలో చర్యలు చేపట్టారు. గ్రామాల్లో పత్తి కొనుగోలు, మద్దతు ధరపై రైతులకు అవగాహన కలిగించడం ద్వారా లక్ష్యాలను సాధించే దిశలో చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది కంటే పత్తి ధర బయట మార్కెట్‌ కం టే ప్రభుత్వం ఇచ్చే ధర ఎక్కువగా ఉండంతో రైతులు కూడా ఈ కేంద్రంలోనే పత్తిని విక్రయించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం క్వింటా ధర రూ. 5,285 ఉంది. బయట మార్కెట్‌లో  తక్కు వ ధర ఇస్తున్నారని, దీంతో ఇక్కడే ఎక్కువ ధర ఉండడంతో లక్ష్యం సాధిస్తామంటున్నారు. డిసెంబరు 12న కేంద్రాన్ని ప్రారంభించగా 24 నుంచి పూర్తి స్థాయిలో కొనుగోలును అధికారులు ప్రారంభించారు. ఈ 15 రోజుల్లో సుమా రు 100 మంది రైతుల నుంచి 1065.08 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు.



గ్రామాల్లో అవగాహన కలిగిస్తున్నాం

జిల్లాలో 5,568 ఎకరాల్లో పత్తిని పండించారు. భామిని, కొత్తూరు, సీతంపేట మండలాలతో పాటు రణ స్థలం, లావేరు మండలాల్లో కూడా పత్తి పంటను రైతులు ఎక్కువగా వేయడంతో ఆ మండలాల్లోని అన్ని గ్రామాల్లో రైతుల కు మద్దతు ధరపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. పత్తిని తూకం వేసిన పది రోజుల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు పత్తిని రాజాంలోని పత్తి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలి. 

-చంటిబాబు, సీసీఐ కేంద్ర ప్రతినిధి

 

Updated Date - 2021-01-11T05:14:41+05:30 IST