Abn logo
Jun 22 2021 @ 02:54AM

‘మండలి’ రద్దుపై వెనక్కు తగ్గలేదు

కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది: సజ్జల

ప్రమాణ స్వీకారం చేసిన కొత్త ఎమ్మెల్సీలు


అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): శాసన మండలి రద్దు నిర్ణయంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెనక్కు తగ్గలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. కౌన్సిల్‌ రద్దు చేయాలన్న అంసెబ్లీ తీర్మానం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు. సోమవారం గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నామినేటెడ్‌ పదవుల్లో సీఎం అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్నారని చెప్పారు. కాగా, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్‌ రాజు, రమేశ్‌ యాదవ్‌తో శాసనమండలి ప్రొటెమ్‌ చైర్మన్‌ బాలసుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు.