700 ఏళ్ల క్రితం నాటి టెక్నిక్స్‌తో మట్టితోనే రెండు అంతస్థుల ఇల్లు.. ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!

ABN , First Publish Date - 2021-11-27T14:22:31+05:30 IST

సాధారణంగా ఎవరైనా భార్యాభర్తలు సొంత ఇంటిని నిర్మించుకోవాలని..

700 ఏళ్ల క్రితం నాటి టెక్నిక్స్‌తో మట్టితోనే రెండు అంతస్థుల ఇల్లు.. ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!

సాధారణంగా ఎవరైనా భార్యాభర్తలు సొంత ఇంటిని నిర్మించుకోవాలని, దానిని అందంగా తీర్చిదిద్దుకోవాలని కలలుగంటారు. అయితే ఇది అంత సులభం కాదు. కొందరికి డబ్బు సమస్య అయితే, మరికొందరికి వేరే కారణాలుంటాయి. అయితే ఒక జంట తమ ఇంటిని ఎలా నిర్మించుకున్నారో చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ జంట స్వయంగా తమ చేతులతో రెండంతస్థుల మట్టి ఇంటిని నిర్మించుకున్నారు. పూణెకు చెందిన యుగా అఖారే, సాగర్ షిరూడెల జంట ఈ అద్భుతం చేసింది. వీరు మహారాష్ట్రలోని తమ గ్రామమైన వాఘేశ్వర్‌లోని ఒక ఫార్మ్‌హౌస్‌ ఏర్పాటు చేసుకోవాలని.. అదికూడా వెదురు, మట్టితో నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. 


అయితే గ్రామానికి చెందిన పలువురు వీరి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆ ప్రాంతలో భారీ వర్షాలు కురుస్తుంటాయని, మట్టితో ఇల్లు కడితే కూలిపోతుందని వారంతా ఈ జంటను హెచ్చరించారు. అయితే యుగా, సాగర్ వారి మాట వినలేదు. అయితే 700 ఏళ్ల క్రితం నాటి టెక్నిక్‌తో ఇల్లు కట్టి అందరికీ చూపించాలనుకున్నారు. ది బెటర్ ఇండియా వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం 2014లో యుగా, సాగర్‌లు తమ చదువు పూర్తిచేసుకుని, సాగా అసోసియేట్స్ పేరుతో ఒక ఫార్మ్ ప్రారంభించారు. వీరిద్దరూ ఆర్కిటెక్ట్‌లు. ఈ నేపధ్యంలో వీరిద్దరూ పలు భవనాలకు డిజైనింగ్ చేశారు. అయితే వీరు నిర్మించుకున్ని ‘మిట్టీ మహల్’ వీటికి చాలా భిన్నమైనది. ఇటీవల వచ్చిన తుపానుకు కూడా ఈ ఇల్లు చెక్కుచెదరలేదు. పైగా ఇంటిలోపలికి కనీసం నీరు కూడా చేరలేదు. ఈ ఇంటిని నిర్మించడానికి ఈ దంపతులు కేవలం రూ. 4 లక్షలు వెచ్చించారు. వీరు ఇంటికి లోకల్ మెటీరియల్ వినియోగించారు. కొన్నింటిని రీసైక్లింగ్ కూడా చేశారు. ఈ ఇంటిని నిర్మించేందుకు వెదురు, ఎర్రమన్ను, గడ్డి వినియోగించామని ఈ దంపతులు తెలిపారు. ఇంటికోసం వినియోగించిన మట్టిలో గడ్డి, బెల్లం, కొన్ని మొక్కల రసం మొదలైనవి మిక్స్ చేశామన్నారు. ఈ తరువాత దానిలో వేప, గో మూత్రం, గోబర్ కలిపామన్నారు. ఈ విధంగా తయారైన మట్టికి ఇటుకలు, వెదురు అతికించామన్నారు. ఈ జంట ఈ ఇంటిని కట్టేందుకు బాటల్ డాబ్ టెక్నిక్‌ను వినియోగించారు. ఇది 700 ఏళ్ల క్రితంనాటి టెక్నిక్ అని వారు తెలియజేశారు. ఈ ఇల్లు వేసవిలో కూడా ఎంతో చల్లదనాన్ని అందిస్తుందని తెలిపారు.

Updated Date - 2021-11-27T14:22:31+05:30 IST