దంపతులను ఒకే జిల్లాకు కేటాయించాలి

ABN , First Publish Date - 2022-01-17T05:52:25+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ 317 జీవోలోని 23వ నిభందన ప్రకారం స్పౌజ్‌ కేటగిరీలోని వారిని ఒకే జిల్లాకు కేటాయించాలని కోరుతూ ఉపాధ్యాయినులు సంక్రాంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో ముగ్గులు వేసి నిరసన తెలియచేశారు.

దంపతులను ఒకే జిల్లాకు కేటాయించాలి
కలెక్టరేట్‌ ఆవరణలో ముగ్గులు వేసి నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయినులు

- కలెక్టరేట్‌లో ముగ్గులతో ఉపాధ్యాయినుల నిరసన

సుభాష్‌నగర్‌, జనవరి 16: ముఖ్యమంత్రి కేసీఆర్‌ 317 జీవోలోని 23వ నిభందన ప్రకారం స్పౌజ్‌ కేటగిరీలోని వారిని ఒకే జిల్లాకు కేటాయించాలని కోరుతూ ఉపాధ్యాయినులు సంక్రాంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో ముగ్గులు వేసి నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాలో  19 జిల్లాలోని స్పౌజ్‌ ఉపాద్యాయులకు మాత్రమే ఒకే జిల్లాలో పోస్టింగులు ఇచ్చారని తెలిపారు. అమిగితా 13 జిల్లాలను బ్లాక్‌ చేశారన్నారు. వారికి ఇంతవరకు ఒకే జిల్లాలో పోస్టింగులు ఇవ్వలేదని తెలిపారు. కరీంనగర్‌ స్పౌజ్‌ ఫోరం తరుపున ఎమ్మెల్సీలు, మంత్రులకు తమ సమస్యలు తెలియజేశామని తెలిపారు. ముఖ్యమంత్రికి వద్దకు వెళదామనుకునే క్రమంలో తమను మధ్యలోనే అరెస్టు చేశారని తెలిపారు. తాము ప్రగతి భవన్‌ ముట్టడి, చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి వెళ్లలేదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఫోరం జిల్లా కన్వీనర్‌ ఎం ఆనందం, జీవన్‌రెడ్డి, ముజీబ్‌, కృష్ణ, కర్ణాకర్‌, జావెద్‌ హుస్సేన్‌, వుయ్యాల శంకర్‌, నిరంజనాచారి, సంతోష్‌, శ్రావణ్‌, రాజేఽశం, సలీం, చంధ్రశేఖర్‌రెడ్డి, ముజీబ్‌, నజీర్‌, హరిత, మంజుల, శ్రీలత, శ్రీదేవి, శ్రీలత, ఉదయశ్రీ, భాగ్య, కవిత, శైలజ, షబానా, లావాణ్య, కీర్తన పాల్గొన్నారు.


Updated Date - 2022-01-17T05:52:25+05:30 IST