మెదక్ అడిషనల్ కలెక్టర్ కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

ABN , First Publish Date - 2020-09-16T22:45:59+05:30 IST

మెదక్ అడిషనల్ కలెక్టర్ కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఐదుగురు నిందితులను 4 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది.

మెదక్ అడిషనల్ కలెక్టర్ కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

హైదరాబాద్: మెదక్ అడిషనల్ కలెక్టర్ కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఐదుగురు నిందితులను 4 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 21న చంచల్‌గూడ జైలు నుంచి నిందితులను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఏ1గా అడిషనల్ కలెక్టర్ నగేష్, ఏ2 వసీం, ఏ3 అరుణారెడ్డి, ఏ4 అబ్దుల్ సత్తార్, ఏ5 జీవన్‌గౌడ్‌లను ఏసీబీ కస్టడీలోకి తీసుకోనుంది. ఏసీబీ కేసులో అరెస్టయిన నలుగురు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. నలుగురిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. 


మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నగేష్‌తోపాటు ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం మహ్మద్, బినామీ జీవన్‌గౌడ్‌లను కూడా అరెస్ట్ చేశారు. లంచం తీసుకుంటూ నగేష్ ఏసీబీకి పట్టుబడ్డారు. నగేష్‌తో పాటు అరుణారెడ్డి, సత్తార్, వసీం, జీవన్‌గౌడ్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. రూ.40లక్షలు లంచం తీసుకుంటూ నగేష్‌ పట్టుబడ్డారు. నర్సాపూర్ మండలం తిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్‌వోసీ కోసం రూ.1.12కోట్లు నగేష్‌ డిమాండ్‌ చేశారు. రూ.1.12 కోట్ల డీల్‌లో రూ.40లక్షలు అడ్వాన్స్‌ తీసుకున్నారు. 

Updated Date - 2020-09-16T22:45:59+05:30 IST