కోర్టు కేసుల్లో శిక్షల శాతం పెరిగేలా పని చేయాలి

ABN , First Publish Date - 2021-11-28T06:22:16+05:30 IST

కోర్టు కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచే విధంగా కోర్టు డ్యూ టీ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని అదనపు ఎస్పీ నర్మద సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులకు శనివారం నిర్వహించిన వర్టికల్‌ శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.

కోర్టు కేసుల్లో శిక్షల శాతం పెరిగేలా పని చేయాలి
మాట్లాడుతున్న ఏఎస్పీ నర్మద

అదనపు ఎస్పీ నర్మద 


నల్లగొండ క్రైం, నవంబరు 27: కోర్టు కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచే విధంగా కోర్టు డ్యూ టీ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని అదనపు ఎస్పీ నర్మద సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులకు శనివారం నిర్వహించిన వర్టికల్‌ శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. కోర్టు కేసుల్లో శిక్షల శాతం పెంచడం, నిందితులకు శిక్ష పడేలా చేయడం వల్ల ప్రజలకు పోలీ్‌సశాఖపై మరింత గౌరవం, నమ్మకం పెరుగుతుందన్నారు. కోర్టు అధికారులు సమర్థవంతంగా సమన్వయంతో పనిచేయాలన్నారు. సాక్షులను, నిందితులను, బాధితులను సమయానికి కోర్టులో హాజరుపరిచేలా చూసుకోవాలన్నారు. కోర్టు విధులకు సంబంధించి పక్కా ప్రణాళికను అవలంబించాలని, కేసు ట్రయల్స్‌ల్లో సీడీలు నమోదు చేసుకోవాలన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు, కోర్టు క్యాలెండర్‌, పెండింగ్‌ కేసులపై వారెంట్లు, సమన్లు తదితర అంశాలపై సమీక్షించారు. కేసుల్లో శిక్షల అమలు, పెండింగ్‌ కేసుల పరిష్కారానికి సంబంధించి పలు విషయాలను అడిగి కేసుల పురోగతిపై పలు సూచనలు చేశారు. సమావేశంలో ఐటీ సెల్‌ అధికారి సుదర్శన్‌చారి, సిబ్బంది, కోర్టు డ్యూటీ, వర్టికల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T06:22:16+05:30 IST