Advertisement
Advertisement
Abn logo
Advertisement

అత్తకు తలకొరివి పెట్టిన కోడలు

 

ఎస్‌.రాయవరం, డిసెంబరు 4: మండలంలోని ఓ గ్రామంలో తనువు చాలించిన అత్తగారికి ఆమె కోడలు తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలివి. వెంకటాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు ముప్పిన మంగ అనారోగ్యంతో శనివారం మృతిచెందింది. ఆమె కుమారుడు ఏడాది కిందట మరణించాడు. దీంతో ఆమె కోడలు పద్మ అన్నీ తానై తలకొరివి పెట్టి అత్తగారి రుణం తీర్చుకుంది.

Advertisement
Advertisement