Abn logo
Sep 21 2021 @ 19:31PM

అత్తింటి వారి వేధింపులతో కోడలు మృతి

సూర్యాపేట: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం ఏనుబాముల గ్రామానికి చెందిన చిత్తలూరి సంధ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతురాలి బంధువులని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతురాలి కుటుంబంలో విషాద చాయలు నెలకొన్నాయి. మృతురాలి కుటుంబికులు కన్నీరుమున్నీరవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption