Abn logo
Sep 21 2021 @ 00:22AM

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి

కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న ఇంద్రసేనారెడ్డి

నారాయణరావుపేట, సెప్టెంబరు 20: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నల్లుగారి ఇంద్రసేనారెడ్డి అన్నారు. సోమవారం నారాయణరావుపేట మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ మండల శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టి పదోన్నతులను కల్పించాలన్నారు. పాఠశాలలో పారిశుధ్య కార్మికులను వెంటనే నియమించి పాఠశాల పరిశుభ్రతకు సహకరించాలని, ఉపాధ్యాయుల కుటుంబంలో ఎవరైనా మరణిస్తే కర్మకాండ కోసం 12 రోజుల సెలవులు మంజూరు చేయాలని కోరారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను లేదా విద్య వలంటర్లను తక్షణమే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం అధ్యక్షులుగా నాగయ్యగారి కిషన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎర్రవల్లి శ్రీనివాస్‌ రెడ్డి, అసోషియేట్‌ అధ్యక్షులుగా ఎన్‌. రామచంద్రారెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలుగా శ్రీదేవి, కార్యదర్శిగా పి.యాదయ్య లను  ఎన్నుకొని నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించినట్టు తెలిపారు.  కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.శశిధర్‌ శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పద్య, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.