ప్రభుత్వం సూచించిన పంటలే మేలు

ABN , First Publish Date - 2020-07-01T10:40:50+05:30 IST

రైతులంతా ఒకే పంట వేసి నష్టపోకుండా, ప్రభుత్వం సూచించిన పంటలే సాగుచేసే నియంత్రిత పద్దతి మేలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

ప్రభుత్వం సూచించిన పంటలే మేలు

సాగు విధానాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సండ్ర


సత్తుపల్లి, జూన్‌ 30: రైతులంతా ఒకే పంట వేసి నష్టపోకుండా, ప్రభుత్వం సూచించిన పంటలే సాగుచేసే నియంత్రిత పద్దతి మేలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మంగళవారం మండలంలోని నారాయణపురంలో వానాకాలం సందర్భంగా వరినాట్లు వేసే ప్రక్రియను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. తెలంగాణలో వ్యవసాయం లాభసాటి కావాలంటే వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంపూర్ణ ఫలితం ఇవ్వాలంటే పంటలకు మంచి ధర రావాలని వారు ఆకాంక్షించారు.


రేజర్లలో నగదు ప్రోత్సహకాలు

మండలపరిధిలోని రేజర్లలో టీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించి నూతన అధ్యక్షుడిగా నంద్యాల వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. అనంతరం గొర్ల మోహనరెడ్డి జ్ఞాపకార్ధం వారి కుమారుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఉత్తమ ఫలితాలు సాధించిన నలుగురు విద్యార్థులకు రూ.25వేల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందించారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్డా హైమావతి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, సొసైటీ చైర్మన్‌ దేశిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-01T10:40:50+05:30 IST