ప్రభుత్వ నయవంచనకు పరాకాష్ఠ

ABN , First Publish Date - 2022-01-19T05:15:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ పీఆర్సీ ప్రకటించి దాన్ని అమలు కోసం అర్థరాత్రి చీకటి జీవోలు జారీ చేయడం ప్రభుత్వ నయవంచనకు పరాకాష్ఠ అని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల నేతలు ధ్వజమెత్తారు.

ప్రభుత్వ నయవంచనకు పరాకాష్ఠ
బద్వేలులో జీవోప్రతులను దహనం చేస్తున్న దృశ్యం

 రివర్స్‌ పీఆర్సీ అమలపై  ఉపాధ్యాయ సంఘాల నేతల ధ్వజం  జీవో ప్రతుల దహనం

బద్వేలు, జనవరి18 : రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ పీఆర్సీ ప్రకటించి దాన్ని అమలు కోసం అర్థరాత్రి చీకటి జీవోలు జారీ చేయడం  ప్రభుత్వ నయవంచనకు పరాకాష్ఠ అని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. ఆమేరకు  ప్యాప్టో జిల్లా  చైర్మన్‌ జీవీసుబ్బారెడ్డి, ఎస్టీ యూ జిల్లాప్రధాన కార్యదర్శి ఎం.సునీల్‌కుమార్‌,  రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యు డు మాదన విజయ్‌కుమార్‌, ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో  మంగళవారం స్థానిక ఎంఆర్‌సీకార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రభుత్వంజారీ చేసిన జీవో ప్రతులను దహనం చేశారు.   కార్యక్రమంలో ప్యాప్టో నేతలు ఓబుల్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య, గురుప్రసాద్‌, పద్మనాభరావు, విజయ్‌కుమార్‌రెడ్డి,  శ్రీనివాసులు, విజయభాస్కర్‌, సింహారెడ్డి, నరసింహారెడ్డి, కంచిరెడ్డి, గఫూర్‌, విజయభాను, అరుణ, సుబ్బమ్మ, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నేత పిచ్చయ్య పాల్గొన్నారు.

పోరుమామిళ్లలో : రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు  రాష్ట్ర ప్రభుత్వం అర్ధ రాత్రి విడుదల చేసిన నల్ల జీవోలను వ్యతిరేకిస్తూ మంగళవారం పోరుమామిళ్లలో జీవో కాపీలను దహనం చేశారు. అంతకు ముందు  అంబే డ్కర్‌ సర్కిల్‌ వరకు నిరసన ర్యాలీ చేశారు.  కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు వీవీ కృష్ణారెడ్డి, సత్తార్‌, కృష్ణయ్య, బాలరాజు, సురేంద్ర, చెన్నయ్య, పుల్లయ్య, నాయబ్‌రసూల్‌, శ్రీనివాసులు, నరసింహారెడ్డి, అబ్దుల్‌, అబ్దుల్‌హుస్సేన్‌, కుళాయప్ప, ప్రసాద్‌లు పాల్గొన్నారు. 

కలసపాడులో : ఉద్యోగ, ఉపాధ్యాయలకు తీరని అన్యాయమైన పీఆర్‌సీ జీవోలను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు కలసపాడులో ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు పీ.రమణారెడ్డి, సి.వెంకటరెడ్డి, శేఖర్‌బాబు, రామసుబ్బయ్య, సత్యనారాయణ, ప్రసాద్‌, కిరణ్‌, శివారెడ్డి, అమర్‌నాధ్‌రెడ్డి పాల్గొన్నారు. 

భగ్గుమన్న ఉపాధ్యాయులు

పులివెందుల రూరల్‌, జనవరి 18: ప్రభుత్వం అర్ధరాత్రి విడుదల చేసిన పీఆర్సీ జీఓలను నిరసిస్తూ ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుపై భగ్గుమ న్నారు. ఆ మేరకు స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం వద్ద ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీఓలను మంగళవారం వారు దహనం చేశారు. ఈ సందర్భంగా  ఉపాధ్యాయ సంఘ నేతలు మాట్లాడుతూ ఇప్పటికే ఐఆర్‌ 27శాతం కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ 23.29శాతం ప్రకటించి ఇపుడు హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, డీఏల్లోను కోత విధించడం దారుణమన్నారు.  కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్స్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వేంపల్లెలో: ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీఓలపై ఉపాధ్యాయ నేతలు, ఉపాధ్యాయులు భగ్గుమన్నారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో జడ్పీ బాలుర, బాలికల, ఉర్దూ హైస్కూల్లలోని ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రతులను దహనం చేశారు.   20న కడప కలెక్టరేట్‌ ముట్టడికి ఉపాధ్యాయులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి సంగమేశ్వరరెడ్డి, యూ టీఎఫ్‌ జిల్లా కార్యదర్శి  శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఖాజీపేటలో: ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర నష్టాన్ని కలిగించే పీఆర్సీ జీవోలను రాత్రికి రాత్రే విడుదల చేయడం దారుణమని ప్యాప్టో నా యకులు రామమోహన్‌, సనావుల్లా, అబ్దుల్లా, ఓబన్నలు ఆరోపించారు. మండల కేంద్రమైన ఖాజీపేట ఎమ్మార్శీ భవనం వద్ద మంగళవారం  జీవో ప్రతులను దహనం చేశారు.  కార్యక్రమంలో ప్యాప్టో నాయకులు సుబ్బారెడ్డి, రామాంజనేయులు, రవిశంకర్‌రెడ్డి, మధురవాణి, సుజాత్మ, రవి, తదితరులు పాల్గొన్నారు. 

కాశినాయనలో: మండల కేంద్రమైన నర్సాపురంలో మంగళవారం ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పీఆర్సీపై ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసనర్యాలీ చేపట్టారు.  కార్యక్రమంలో యూనియన్ల నాయకులు సుబ్రమణ్యం, లక్ష్మీరెడ్డి, రమణ,సాంభశివారెడ్డి, సుభాషిణి, చంద్రశేఖర్‌ తదితరులు సపాల్గొన్నారు.

చాపాడులో: ఎంఈవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు పీఆర్సీ సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వు ప్రతులను మంగళవారం దహనం చేశారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను 30 శాతం పెంచాలని, ఇంటి అలవెన్స్‌ను యధాతదంగా ఉంచాలని కోరారు.ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని జీవోలలో సవరణలు చేయాలని  డిమాండ్‌ చేశారు.





Updated Date - 2022-01-19T05:15:37+05:30 IST