Abn logo
Sep 25 2021 @ 21:32PM

కళింగపట్నం-గోపాల్‌పూర్ మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం

శ్రీకాకుళం‌: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ కళింగపట్నం-గోపాల్‌పూర్ మధ్య ఆదివారం తీరం దాటే అవకాశం ఉందని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందన్నారు. గార మండలం బందరువానిపేటలో తుఫాన్ పరిస్థితిని కలెక్టర్ సమీక్షించారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసామని ఆయన తెలిపారు. కంట్రోల్ రూం నెంబర్...08942 240557. తుఫాన్ తీరం దాటే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేసారు. 


ఇవి కూడా చదవండిImage Caption