Oct 25 2021 @ 03:38AM

‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు’ ఎంతో స్పెషల్‌

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు’ను తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈ రోజు అందుకోనున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకునేందుకు ఆయన ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రజనీ తన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడుతూ... ఇలాంటి శుభతరుణంలో తన గురువు కె.బాలచందర్‌ లేకపోవడం ఎంతో బాధగా ఉందన్నారు. ‘‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇంత గొప్ప అవార్డు రావడం సినీ ప్రేక్షకులు, తమిళ ప్రజల ఆదరాభిమానాల వల్లే సాధ్యమైంది. ఇలాంటి అవార్డు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఇంత మంచి తరుణంలో నా గురువు కె.బాలచందర్‌ లేకపోవడం ఎంతో బాధిస్తోంది’’ అని చెప్పారు.  

ఆంధ్రజ్యోతి, చెన్నై