పట్టు తప్పితే... గల్లంతే!

ABN , First Publish Date - 2020-09-08T05:30:00+05:30 IST

మీరు చెట్లు ఎక్కగలరేమో కానీ ఈ మెట్లు ఎక్కలేరు. ఎందుకో తెలుసా? ఈ మెట్లు ఎక్కాలంటే బోలెడంత గుండె ధైర్యం కావాలి. పొరపాటున కాలు జారితే గల్లంతవ్వడం ఖాయం. వీటిని ‘హైకూ మెట్లు’ అని పిలుస్తారు. ఇంతకీ ఇవి ఎక్కడున్నాయో తెలుసా?...

పట్టు తప్పితే... గల్లంతే!

మీరు చెట్లు ఎక్కగలరేమో కానీ ఈ మెట్లు ఎక్కలేరు. ఎందుకో తెలుసా? ఈ మెట్లు ఎక్కాలంటే బోలెడంత గుండె ధైర్యం కావాలి. పొరపాటున కాలు జారితే గల్లంతవ్వడం  ఖాయం. వీటిని ‘హైకూ మెట్లు’ అని పిలుస్తారు. ఇంతకీ ఇవి ఎక్కడున్నాయో తెలుసా?


  1. అమెరికా హవాయి ద్వీపాల్లో ఒకటైన ఒహాహు ద్వీపంలో ఈ మెట్లు ఉన్నాయి. వీటిని 1942లో అమెరికా నౌకాదళం నిర్మించింది. 
  2. పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న తమ నౌకలకు రేడియో సంకేతాలు అందించడానికి ఎత్తైన ప్రదేశంలో యాంటెన్నా నిర్మించాలని నౌకాదళం భావించింది. అందుకోసం ఈ కొండ ప్రాంతాన్ని ఎంచుకుంది. కొండపైకి  చేరుకోవడానికి మెట్లు ఏర్పాటు చేసింది. 
  3. మొత్తం 3922 మెట్లు ఉన్నాయి. కొన్ని చోట్ల మెట్లు కొండపైకి నిట్టనిలువుగా ఉంటాయి. 
  4. ప్రకృతి ప్రేమికులు, సాహసాలను ఇష్టపడే వారు ఈ మెట్లు ఎక్కి కొండపైకి చేరుకునేందుకు ఉత్సాహం చూపుతుంటారు. కొండపై నుంచి చూస్తే ప్రకృతి సౌందర్యం ఆకట్టుకుంటుంది.
  5. అయితే ఇక్కడ ప్రమాదాలు జరగడంతో సాధారణ ప్రజలు ఈ మెట్లు ఎక్కకుండా నిషేధం విధించారు. 

Updated Date - 2020-09-08T05:30:00+05:30 IST