నా తప్పుల్ని మన్నించండి.. నా కూతుళ్లను జాగ్రత్తగా చూసుకోండి.. అంటూ ఓ వివాహిత ఘోరం.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2021-10-15T20:03:29+05:30 IST

మంచం మీద పడి ఉన్న భర్తను చూడటానికి కూడా అనుమతించలేదు. అయినా కోడలు మాత్రం ఆమెను పల్లెత్తు మాట కూడా అనలేదు. అత్తకు ఓ లెటర్ రాస్తూ అందులో..

నా తప్పుల్ని మన్నించండి.. నా కూతుళ్లను జాగ్రత్తగా చూసుకోండి.. అంటూ ఓ వివాహిత ఘోరం.. అసలు కథేంటంటే..

అత్తాకోడళ్ల మధ్య.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అత్తను వేధించే కోడలు ఉన్నట్లే.. కోడలిని వేధించే అత్తలూ ఉంటారు. ఇలాగే గుజరాత్‌లో ఓ అత్త కోడలిని వేధిస్తూ ఉండేది. మంచం మీద పడి ఉన్న భర్తను చూడటానికి కూడా అనుమతించేది కాదు. అయినా కోడలు మాత్రం ఆమెను పల్లెత్తు మాట కూడా అనలేదు. అత్తకు ఓ లెటర్ రాస్తూ అందులో.. ‘‘నా తప్పుల్ని మన్నించండి.. నా కూతుళ్లను జాగ్రత్తగా చూసుకోండి.. అంటూ తనకు బర్త్‌డే గిఫ్టు ఇస్తున్నట్లు గుర్తు చేసింది. చివరకు ఆమె చేసిన పని.. స్థానికంగా సంచలనం సృష్టించింది.


గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ శైల్‌రాజ్ బంగ్లాస్ సొసైటీ అపార్ట్‌మెంట్స్‌లో కృపా పటేల్(41).. భర్త చిరాగ్, ఇద్దరు కూతుళ్లతో నివాసం ఉంటోంది. పెద్ద కూతురు దేవాన్షి(22) అమెరికాలో ఉంటుండగా.. చిన్న కూతురు యానా(16) తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో 2108లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృపా భర్త చిరాగ్ తీవ్రంగా గాయపడ్డాడు. బ్రెయిన్ డెడ్ కావడంతో అప్పటి నుంచి ఉలుకూపలుకూ లేకుండా ఉన్నాడు. ఈ క్రమంలో ఆస్తి తగాదాలు తదితర అంశాల్లో కోడలితో విభేదాలు తలెత్తాయి. దీంతో చిరాగ్‌ను కనీసం చూడటానికి కూడా కోడలిని అనుమతించలేదు. దీనిపై కోడలు పలుమార్లు కోర్టులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.


 ఈ క్రమంలో ఉన్నట్టుండి కృపా ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. అయితే కృపా గదిలో ఓ లేఖ కనిపించింది. అందులో ఇలా రాసి ఉంది.. ‘‘ నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇది కొందరికి బాధ కలిగించినా.. చాలా మందికి సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే నా ఇద్దరు కూతుళ్లు అనాథలవుతారనేది వాస్తవం. ఇది తెలిసినా ఆత్మహత్య తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు. నా పేరుపై తెలవ్, ఖోడియర్ ప్రాంతాల్లో ఉన్న భూమిని.. నా కూతుళ్లకు ఇవ్వండి. మీ కొడుకు చిరాగ్‌ కోరిక కూడా ఇదే. భూమిని వారికి ఇస్తేనే నా ఆత్మ శాంతిస్తుంది. అలాగే నా తల్లిదండ్రులను బాగా చూసుకోండి. అత్తయ్యా నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా.. మీకు పుట్టినరోజు కానుకగా నా చావును ఇస్తున్నా.. ఇది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు’’.. అని రాసి ఉంది. లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా కృపా మామయ్య సీపీ పటేల్.. రిటైర్డ్ కలెక్టర్ కావడం గమనార్హం.

Updated Date - 2021-10-15T20:03:29+05:30 IST