Abn logo
May 29 2020 @ 05:49AM

వడదెబ్బతో ఒకరి మృతి

కాటారం, మే 28 : వడదెబ్బతో ఒకరు మృతి చెందిన సంఘటన చింతకానిలో గురువారం చోటుచేసుకుంది. చేరాల రవి(42) వ్యవసాయ పనులతో పాటు ఇంటి అవసరాల కోసం బయటకు వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. ఇంటికి వచ్చి వాంతులు చేసుకుని అస్వస్థత పాలయ్యాడు. ఆర్‌ఎంపీ వద్ద ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మహాదేవపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే రవి మృతి చెందాడు. 

Advertisement
Advertisement