తీర్మానాలు తీరు మారేనా-తప్పులు సమీక్షించేనా?

ABN , First Publish Date - 2020-05-28T01:48:13+05:30 IST

ఏపీలో తెలుగుదేశం పార్టీ రెండు రోజుల పాటు ఆన్‌లైన్‌లో మహానాడు నిర్వహిస్తోంది. బుధవారం తొలిరోజు పూర్తి అయింది. మహానాడులో ..

తీర్మానాలు తీరు మారేనా-తప్పులు సమీక్షించేనా?

హైదరాబాద్: ఏపీలో తెలుగుదేశం పార్టీ రెండు రోజుల పాటు ఆన్‌లైన్‌లో మహానాడు నిర్వహిస్తోంది. బుధవారం తొలిరోజు పూర్తి అయింది. మహానాడులో దాదాపు 14 వేల మంది కార్యకర్తలు... జూమ్ యాప్ ద్వారా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ‘‘ఆటు పోట్లు మధ్య ఆన్‌లైన్ మహానాడు. ఒక వైపు ఘోర పరాభవం. మరోవైపు కరోనా భయం. పసుపు పండగ మహానాడు జూమ్‌లో ఎలా ఉండేనో. తీర్మానాలు తీరు మారేనా-తప్పులు సమీక్షించేనా?. భజంత్రీలు లేకుండా భజన కాకుండా ఫోకస్ పెట్టేనా.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్‌లో విశ్లేషకులు నరసింహారావు, టీడీపీ నేతలు గద్దె రామ్మోహన్‌ ప్రభాకర్‌చౌదరి, బీజేపీ నేత చందూ సాంబశివరావు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా విశ్లేషకులు నరసింహారావు మాట్లాడుతూ ‘‘ఎన్నికల్లో పడిన ఓట్లను బట్టి పార్టీ స్థితిగతులను అంచనా వేయొద్దు. కొన్ని సార్లు ప్రజలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. పనికిమాలిన వాళ్లను కూడా అధికారంలోకి తీసుకొస్తారు. వైసీపీ గెలుపు.. నిజమైన గెలుపే కాదు. తెలుగుదేశంలో తెలుగు అని ఉంది కాబట్టి సీఎం జగన్‌ తెలుగుని తీసేసి ఇంగ్లీష్‌ పెట్టాలనుకున్నారేమో.’’ అని అన్నారు. 


టీడీపీ నేత గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ ‘‘ గెలుపోటములు సర్వ సాధారణ. అధైర్యపడకుండా కార్యకర్తల్ని చంద్రబాబు ముందుకు నడిపిస్తున్నారు. బుధవారం భిన్నమైన మహానాడును చూస్తున్నాం. కరోనా కారణంగా జూమ్‌ యాప్‌ ద్వారా మహానాడు. టెక్నాలజీని వాడడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. అన్ని అవకాశాలు ఉన్నా సీఎం గదిలోంచి బయటికి రావట్లేదు. చివరికి ప్రెస్‌ మీట్లకు కూడా జగన్‌ రావడం లేదు.’’ అని తెలిపారు. 


బీజేపీ నేత చందూసాంబశివరావు మాట్లాడుతూ టీడీపీకి మూడో తరం నడుస్తోంది. టీడీపీ ఓటమికి కారణాలను మహానాడులో విశ్లేషించుకోవాలి. ఏపీ కంటే తెలంగాణలో టీడీపీకి బలమైన కేడర్‌ ఉండేది. అనేక అంశాలపై మహానాడులో చర్చించాం. ప్రజాసంక్షేమం గురించి మాట్లాడాల్సిన అవసరం. ప్రధాన ప్రతిపక్షంగా మాపై ఉంది. అధికారం లేకపోయినా నాయకత్వం పటిష్టంగా ఉండాలి. తెలంగాణ కేబినెట్‌ అంతా టీడీపీ నుంచి వచ్చిన వారే.’’ అని చెప్పారు. 

Updated Date - 2020-05-28T01:48:13+05:30 IST