ఆస్తి పన్ను పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-18T04:47:08+05:30 IST

పెంచిన ఆస్తిపన్నుతో ప్రజలపై మోయలేని భారం పడుతోందని జీవీఎంసీ కమిషనర్‌ సృజనకు షీలానగర్‌, వేంకటేశ్వరకాలనీ సంక్షేమ సంఘాల నాయకులు విన్నవించారు.

ఆస్తి పన్ను పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
జీవీఎంసీ కమిషనర్‌ సృజనకు వినతిపత్రం అందిస్తున్న నేతలు

అక్కిరెడ్డిపాలెం, జూన్‌ 17: పెంచిన ఆస్తిపన్నుతో ప్రజలపై మోయలేని భారం పడుతోందని జీవీఎంసీ కమిషనర్‌ సృజనకు షీలానగర్‌, వేంకటేశ్వరకాలనీ సంక్షేమ సంఘాల నాయకులు విన్నవించారు. గురువారం  ఆమెను కలిసిన 69వ వార్డు పరిధిలోని పలు కాలనీల నాయకులు పెంచిన ఆస్తిపన్నుతో ఇబ్బందులను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆస్తి పన్ను పెంపుదల  నిర్ణయాన్ని పునరాలోచించి పాత పద్ధతిలోనే ఇంటి పన్ను వసూలును చేయాలని కోరారు.  షీలానగర్‌ కాలనీ అధ్యక్షుడు జి.సుబ్బారావు, వెంకటేశ్వరకాలనీ అధ్యక్షుడు ఎ.వీర్రాజు, శ్రీనివాసరావు, పార్వతీశం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T04:47:08+05:30 IST