Abn logo
Sep 23 2020 @ 17:06PM

డిక్లరేషన్‌లో జగన్‌ సంతకం పెట్టాల్సిందే: దేవినేని ఉమ

Kaakateeya

విజయవాడ: డిక్లరేషన్‌లో సీఎం జగన్‌ సంతకం పెట్టాల్సిందేనని మాజీమంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. డిక్లరేషన్‌పై సంతకం పెట్టకపోతే హిందువులను అవమానించడమేనని, సీఎం హిందువుల మనోభావాలను గౌరవించాలన్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడులపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు జగన్‌ అంతరంగానికి అద్దం పడుతున్నాయని, హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసే మంత్రులపై.. చర్యలు తీసుకోవడానికి జగన్‌ ఎందుకు జంకుతున్నారు? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

Advertisement
Advertisement
Advertisement