అతి లోతైన గుహ!

ABN , First Publish Date - 2021-05-22T09:15:56+05:30 IST

ఆ గుహలోకి వెళ్లడం సామాన్యులకు సాధ్యం కాదు. దాని లోతు ఎంతో తెలుసుకోవడానికి పరిశోధకులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇంతకీ ఆ గుహ ఎక్కడుందో తెలుసా?

అతి లోతైన గుహ!

ఆ గుహలోకి వెళ్లడం సామాన్యులకు సాధ్యం కాదు. దాని లోతు ఎంతో తెలుసుకోవడానికి పరిశోధకులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇంతకీ ఆ గుహ ఎక్కడుందో తెలుసా?


  • జార్జియాలోని అరబికా మస్సిఫ్‌ ప్రాంతంలో కొన్ని గుహలున్నాయి. వాటి పేరు క్రుబేరా కేవ్స్‌. ప్రపంచంలో అతి లోతైన గుహలుగా వాటికి గుర్తింపు ఉంది.
  • క్రుబేరా కేవ్‌ లోతు 2197 మీటర్లు. ఈ లోతును నిర్ధారించడానికి పరిశోధకులు ఎంతో శ్రమించారు. 
  • కొన్ని చోట్ల ఇరుకుగా, మరికొన్ని చోట్ల విశాలంగా ఉందీ గుహ. తాళ్ల సహాయంతో దిగుతూ, ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పరిశోధకులు ఆ గుహ లోతును నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

Updated Date - 2021-05-22T09:15:56+05:30 IST