Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఢిల్లీ మహాగర్జనకు భారీగా తరలిరావాలి

 మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ అధ్యక్షుడు రేగుంట కేశవ్‌ మాదిగ
జైనూర్‌, నవంబరు 30: ఎస్సీ వర్గీకరణ సాధన కోసం డిసెంబరు 14న నిర్వహించనున్న ఢిల్లీ  మహాగర్జనకు జిల్లా నుంచి విద్యార్థులు భారీగా తరలిరావాలని మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ అధ్యక్షుడు రేగుంట కేశవ్‌ మాదిగ కోరారు. స్థానిక గణేష్‌ నగర్‌ కాలనీలో మంగళవారం ఎమార్పీఎస్‌ మాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డిసెంబరులో ప్రారంభం కానున్న పార్లమెంట్‌  సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకర ణకు చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీల వర్గీకరణ కోసం మాదిగ స్టూండెంట్లు , యువకులు అధిక సఖ్యంలో తరలి రావాలని ఆయన కోరారు. ఇందులో భాగంగా మాదిగ విద్యార్థి సమాఖ్య మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. కమిటీ మండల అధ్యక్షుడిగా  మవాలె కృష్ణ, ప్రధాన కార్యద ర్శిగా మానె రాజేశ్వర్‌, సభ్యులుగా ధడెకర్‌ కిష్ణ, దయాకర్‌, యోగేశ్వర్‌, పాలె ప్రవిణ్‌, పాలె అర్జున్‌, జిల్లపెల్లి శ్రీకాంత్‌, క్‌, కాలె జ్ఞానేశ్వర్‌, రజనీకాంత్‌  ఎన్నికయ్యారని తెలిపారు.

Advertisement
Advertisement