డీఈవో మెతకవైఖరి విడనాడాలి

ABN , First Publish Date - 2021-01-21T05:42:03+05:30 IST

జిల్లా విద్యాశాఖాధికారి మెతకవైఖరి విడనా డాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) డిమాండ్‌ చేసింది.

డీఈవో మెతకవైఖరి విడనాడాలి
ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు




 డీటీఎఫ్‌ నిరసన ప్రదర్శన

గుజరాతీపేట: జిల్లా విద్యాశాఖాధికారి మెతకవైఖరి విడనా డాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) డిమాండ్‌ చేసింది. డీఈవో మెతకవైఖరితో  కార్యా లయంలోని బి-సెక్షన్‌, ఏడీ-2 గుమస్తాలు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని డీటీ ఎఫ్‌ నేతలు ఆరోపించారు. ఈ మేరకు డీఈవో కార్యాలయం ఎదుట బుధవారం నిరసన ప్రద ర్శన చేపట్టారు. గుమస్తాల వ్యవహారశైలిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా   పట్టిం చుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే  ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2002 హిందీపండిట్లు,  స్కూల్‌ అసిస్టెంట్ల(తెలుగు)గా పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు నోషనల్‌ ఇంక్రి మెంట్లు  కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎచ్చెర్ల మండలం జలిపినాయుడుపేట పాఠశాలను పునఃప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో డీటీఎఫ్‌  డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్ము అప్పలరాజు, పేడాడ కృష్ణారావు,  కుల నిర్మూలన పోరాటసమితి జిల్లా సభ్యుడు ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-01-21T05:42:03+05:30 IST