ప్రతీశాఖ బాధ్యతాయుతంగా మెలగాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-06-22T07:05:56+05:30 IST

నూతన కలెక్టరేట్‌ కార్యాలయ సముదాయంలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రతీ శాఖ పచ్చదనం, పారిశుధ్యంపై బాధ్యతలు నిర్వహించాలని కలెక్టర్‌ శరత్‌ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్‌ కార్యాలయ మీటింగ్‌ హాల్‌లో ఆయన

ప్రతీశాఖ బాధ్యతాయుతంగా మెలగాలి : కలెక్టర్‌
బీసీ సంక్షేమాధికారి కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డిటౌన్‌, జూన్‌ 21: నూతన కలెక్టరేట్‌ కార్యాలయ సముదాయంలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రతీ శాఖ పచ్చదనం, పారిశుధ్యంపై బాధ్యతలు నిర్వహించాలని కలెక్టర్‌ శరత్‌ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్‌ కార్యాలయ మీటింగ్‌ హాల్‌లో ఆయన తొలిసారిగా జిల్లా అధికారులతో సమావేశమై మాట్లాడుతూ అద్భుతమైన ఏర్పాట్లతో సీఎం కేసీఆర్‌ పర్యటనను విజయవంతం చేసినందుకు జిల్లా అధి కారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యాలయంలో అన్ని విభాగాల నుంచి పరిశుభ్రమైన వాతావరణం కల్పించుకోవాలని, ఫర్నిచర్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని, అవసరమైన చోట కొత్త పర్నిచర్‌ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కార్యాలయ సముదాయల పారిశుధ్యం కోసం శానిటేషన్‌ ఏజెన్సీని నియమించడం జరుగుతుందని తెలిపారు. కార్యాలయ పరిసరాలలో, కార్యాల యం చుట్టు ప్రతీ ఒక్క శాఖ మొక్కల పెంపకానికి భాద్యతలు తీసుకోవాలని, వివిధ రకాల పూల మొక్కలతో ఆహ్లాదకరమైన పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అలాగే, హైవే ప్లాంటేషన్‌ త్వరగా పూర్తిచేయాలని, అటవీ శాఖ అధికారులు గుంతలు త్వరగా తీయించి అధికారులకు అప్పగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, తదితరులు పాల్గొన్నారు.

 ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయాలు ప్రారంభం

నూతన కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ కార్యాలయాన్ని కలెక్టర్‌ శరత్‌ ప్రారంభించారు. ఎస్పీ కార్పొరేషన్‌, జిల్లా పౌరసరాఫరాల, సీపీవో కార్యాలయాలను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే ప్రారంభించారు. తర్వాత వారు మాట్లాడుతూ కొత్త కలెక్టరేట్‌ భవనంలో 60 శాఖలు ఒకే చోట ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు కొండల్‌రావు, రాజారాం, సంజీవ్‌రావు, బాపురెడ్డి సీవిల్‌ సప్లయ్‌ డీఎం జితేంద్రప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

పల్లెలను హరితపల్లెలుగా మార్చాలి

పల్లెలను హరితపల్లెలుగా మార్చాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్‌లో అధికారులతో ఆయన మాట్లాడుతూ హరితహారం లక్ష్యానికి అనుగుణంగా గ్రామాల్లో గుంతలు తీయించాలని, నర్సరీలలో మొక్కలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-06-22T07:05:56+05:30 IST