డీజీపీ వ్యాఖ్యలు దారుణం

ABN , First Publish Date - 2021-01-17T05:40:16+05:30 IST

విగ్రహాల ధ్వంసంపై రాష్ట్రంలో ఉన్నత పదవిలో ఉన్న డీజీపీ స్థాయి వ్యక్తి దారుణమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని ‘తూర్పు’ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు.

డీజీపీ వ్యాఖ్యలు దారుణం

ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు

వెంకోజీపాలెం, జనవరి 16: విగ్రహాల ధ్వంసంపై రాష్ట్రంలో ఉన్నత పదవిలో ఉన్న డీజీపీ స్థాయి వ్యక్తి దారుణమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని ‘తూర్పు’ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. పోలీసు వ్యవస్థకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మచ్చ తెస్తున్నారని, గతంలో డీజీపీగా సేవలందించిన వారెవరూ ఇలా మాట్లాడలేదని, పోలీస్‌ ఉన్నతాధికారిగా కాకుండా వైసీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవీతంలో ఇలాంటి డీజీపీని ఎన్నడూ చూడలేదని, రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసిన నిజమైన దోషులను పట్టుకుని చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. 


‘డీజీపీని దూషించే హక్కు వెలగపూడికి లేదు’

డీజీపీ స్థాయి అధికారిని దూషించే హక్కు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు లేదని వైసీపీ తూర్పు నియోజకవర్గం కన్వీనర్‌ అక్కరమాని విజయనిర్మల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత.. ప్రస్తుత సీఎం జగన్‌పై కోడికత్తి దాడిలో ఎమ్మెల్యే హస్తం ఉన్నట్టు తమకు అనుమానంగా ఉందన్నారు. ఆలయాలపై దాడులకు సంబంధించి టీడీపీ కార్యకర్తల హస్తం ఉందంటూ పోలీస్‌ అధికారులు అరెస్టు చేస్తే వెలగపూడికి ఎందుకు ఉలిక్కిపాటని ప్రశ్నించారు.

Updated Date - 2021-01-17T05:40:16+05:30 IST