30లో ఆహారం ఇలా..

ABN , First Publish Date - 2020-10-01T05:30:00+05:30 IST

ముప్ఫయి నుంచి యాభై ఏళ్ల వయసు ఉన్నవారు మెరుగైన ఆరోగ్యం, కోసం సూపర్‌ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి అంటున్నారు ఫిట్‌నెస్‌, పోషకాహార నిపుణుడు మిహిర్‌ గడానీ...

30లో ఆహారం ఇలా..

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు వస్తుంటాయి. వాటికి తగ్గట్టుగా ఆహారం తినాలి. లేదంటే జీవక్రియలు నెమ్మదించడం, జీర్ణసమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముప్ఫయి నుంచి యాభై ఏళ్ల వయసు ఉన్నవారు మెరుగైన ఆరోగ్యం, కోసం సూపర్‌ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి అంటున్నారు ఫిట్‌నెస్‌, పోషకాహార నిపుణుడు మిహిర్‌ గడానీ. 


గ్రీన్‌ సూపర్‌ ఫుడ్స్‌: ఇవి శరీరం పీహెచ్‌ను సమపాళ్లలో ఉంచుతాయి. అంతేకాదు అవసరమైన పోషకాలను అందిస్తాయి. పాలకూర, కాలే, కొత్తిమీర, స్పిరులినా వంటివి తినాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శక్తిని ఇస్తాయి. 


ప్లాంట్‌ ప్రొటీన్స్‌:  మొక్కలలో ఉండే ప్రొటీన్లు ఉన్న ఆహారం తినాలి. బఠాణీ గింజల్లో ఉండే ప్రొటీన్‌లో ఐరన్‌ అధికంగా ఉంటుంది. లాక్టోస్‌ పడని వారు బఠాణీ గింజలు తింటే ఐరన్‌ లోపం ఏర్పడదు. అంతేకాదు మొక్కల ప్రొటీన్లలో గ్లుటెన్‌ తక్కువ. చిరుధాన్యాలు, సోయా వంటివి ఎక్కువ శక్తిని ఇస్తాయి.


ప్లాంట్‌ విటమిన్స్‌: మొక్కల్లో లభించే విటమిన్లను శరీరం తొందరగా గ్రహిస్తుంది. సీ, ఇ విటమిన్లు రోగనిరోధక శక్తి పెంచి  ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలోని బయోఫ్లావనాయిడ్స్‌ వంటి ఫొటోకెమికల్స్‌ విటమిన్లు మెండుగా ఉండే ఆహారంలో ఉంటాయి.


చిరుధాన్యాలు, గింజలు: కార్బోహైడ్రేట్స్‌కు ఇవి చక్కని వనరులు. వీటిలో ఫైబర్‌, కాల్షియం, ఐరన్‌, పొటాషియం, ఫ్యాటీ ఆమ్లాలు అధిక మోతాదులో ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, జీర్ణాశయానికి ఎంతో మంచివి. రోగనిరోధకశక్తిని పెంచుతాయి కూడా. అవిసె గింజలు, చియా సీడ్స్‌, నువ్వులు, గుమ్మడి, పొద్దుతిరుగుడు పువ్వు గింజలను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని సలాడ్స్‌, డ్రింక్స్‌, స్మూతీలలో వేసుకొని తినొచ్చు. లేదంటే పొడి రూపంలో తీసుకున్నా సరే.

Updated Date - 2020-10-01T05:30:00+05:30 IST