వైద్యసిబ్బంది వేతనాల్లో వ్యత్యాసం తొలగించాలి

ABN , First Publish Date - 2020-06-01T09:17:26+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది విధులు సమానంగా నిర్వహిస్తున్నా వేతనాల్లో వ్యత్యాసం చూపిస్తున్నారని సీఐటీయూ మండల

వైద్యసిబ్బంది వేతనాల్లో వ్యత్యాసం తొలగించాలి

అరకురూరల్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది విధులు సమానంగా నిర్వహిస్తున్నా వేతనాల్లో వ్యత్యాసం చూపిస్తున్నారని సీఐటీయూ మండల కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ అన్నారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో 15 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నవారికి రూ.22,500 ఐదు నెలలకొకసారి చెల్లిస్తున్నారన్నారు. అదే వైద్యవిధాన పరిషత్‌, డిస్ర్టిక్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌, నేషనల్‌ రూరల్‌ హెల్త్‌మిషన్‌, 13వ ఆర్థిక సంఘం, కోవిడ్‌-19 కాంట్రాక్ట్‌ స్టాఫ్‌నర్సులకు రూ.34 వేల వేతనాలు ప్రభుత్వం చెల్లిస్తుందని, వీరికి ప్రతినెల జీతాలు చెల్లిస్తుందన్నారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణకు వినతిపత్రం ఇచ్చామని, దీనిపై ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టిలో పెడతానని హమీ ఇచ్చారన్నారు. ఈ సమావేశంలో బి. ఉమాదేవి, పుష్పలత, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-01T09:17:26+05:30 IST