జిల్లాలో మహిళా ఓటర్ల్లే అధికం

ABN , First Publish Date - 2021-06-20T05:54:22+05:30 IST

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధిక ంగా ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన ఓటర్ల లి స్టులో వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. వ్యవసాయం, బీడీలతో పాటు అన్ని రంగాల్లో ముందున్న మహిళలు ఓటరు లిస్టు లోనూ ముందంజలో ఉన్నారు.

జిల్లాలో మహిళా ఓటర్ల్లే అధికం

నిజామాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధిక ంగా ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన ఓటర్ల లి స్టులో వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. వ్యవసాయం, బీడీలతో పాటు అన్ని రంగాల్లో ముందున్న మహిళలు ఓటరు లిస్టు లోనూ ముందంజలో ఉన్నారు. జిల్లాలో ఆరు నియోజకవర్గా లలో 13 లక్షల 11 వేల 557 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 6,90,078 మంది ఉండగా, పురుష ఓటర్లు 6,21,450 మంది ఉన్నారు. జిల్లాలోని ఆర్మూర్‌ నియోజకవర్గ ంలో 214 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 1,92,822 ఓటర్లు ఉ న్నారు. వీరిలో మహిళా ఓటర్లు 1,04,395 మంది ఉండగా పురుష ఓటర్లు 91,427 ఉన్నారు. బోధన్‌ నియోజకవర్గంలో 246 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 2,07,202 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో  మహిళా ఓటర్లు 1,07,586 మంది ఉండ గా.. పురుష ఓటర్లు 99,615 మంది ఉన్నారు. బాన్సువాడ ని యోజకవర్గంలో 237 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 1,84,519 మంది ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 95,948 మంది ఉండగా.. పురుష ఓటర్లు 88,566 మంది ఉన్నారు. నిజామా బాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో 281 పోలింగ్‌ కేంద్రాల పరి ధిలో 2,79,240 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓ టర్లు 1,43,541 మంది ఉండగా.. పురష ఓటర్లు 1,35,683 మ ంది ఉన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో 286 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 2,38,947 మంది ఓటర్లు ఉన్నా రు. వీరిలో మహిళా ఓటర్లు 1,27,679 మంది ఉండగా.. పు రుష ఓటర్లు 1,11,264 మంది ఉన్నారు. బాల్కొండ నియోజ కవర్గంలో 245 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 2,05,827 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 1,10,929 మంది ఉండగా.. పురుష ఓటర్లు 94,895 మంది ఉన్నారు. ప్రస్తుతం కొత్త ఓటర్లను నమోదు చేస్తున్నారు. జిల్లాలో 18 సంవత్సరా లు వచ్చిన వారందరికీ ఓటరుగా అవకాశం కల్పిస్తున్నారు. కొత్త ఓటర్లు చేరిన తర్వాత మహిళా ఓటర్ల జాబితా మరిం త పెరిగే అవకాశం ఉంది.

Updated Date - 2021-06-20T05:54:22+05:30 IST