Advertisement
Advertisement
Abn logo
Advertisement

జిల్లాకు రూ.121.46 కోట్ల పింఛన సొమ్ము మంజూరు

కొత్త నిబంధనలతో తప్పని ఇక్కట్లు 

అనంతపురం వ్యవసాయం, నవంబరు 29:  జిల్లాకు డిసెంబరు నెలకు సంబంధించి 5.14 లక్షల మంది పింఛనదారులకు రూ.121.46 కోట్ల సొమ్ము మంజూరు చేశారు. డిసెంబరు 1వతేదీ నుంచి మూడురోజులపాటు వలంటీర్ల ద్వారా పింఛనదారుల ఇంటి వద్దనే సొమ్ము పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం మూడు నెలలుగా కొత్త నిబంధనలు విధించడంతో పింఛనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏ నెల పింఛన ఆ నెలలోనే తీసుకోవాలన్న షరతు పెట్టారు. లేకపోతే మరుసటి నెలలో గత నెల పింఛన ఇవ్వరు. గతంలో పోర్టబులిటీ పద్ధతిలో ఎక్కడైనా పింఛన తీసుకునే వెసులుబాటు ఉండేది. ఆ పద్ధతికి ప్రభుత్వం స్వస్తి చెప్పింది. ఈ రెండు సదుపాయాలు లేకపోవడంతో పింఛనదారులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. పలు రకాల పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన పింఛనదారులు కొత్త నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రెండు నెలలకోమారు పింఛన తీసుకునే వెసులుబాటు ఉండేది. పాత పద్ధతిలోనే పింఛన తీసుకునే అవకాశం కల్పించాలని పింఛనదారులు కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పింఛనదారుల సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. మరి మేరకు చొరవ చూపుతారో వేచిచూడాల్సిందే.

Advertisement
Advertisement