పంచాయతీల నిధుల మళ్లింపు దారుణం

ABN , First Publish Date - 2021-12-03T06:29:13+05:30 IST

గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడం దారుణమని సర్పంచులు, టీడీపీ నాయకులు విమర్శించారు.

పంచాయతీల నిధుల మళ్లింపు దారుణం
యాడికి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నసర్పంచలు, టీడీపీ నాయకులు

ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట సర్పంచల నిరసన


యాడికి, డిసెంబరు 2: గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడం దారుణమని సర్పంచులు, టీడీపీ నాయకులు విమర్శించారు. నిధుల మళ్లింపును నిరసిస్తూ మండలంలోని పలువురు సర్పంచులు, టీడీపీ నాయకులు గురువారం ఎంపీడీఓ కా ర్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈసందర్భంగా సర్పంచులు దేవేంద్ర, కంబగిరిస్వామి, రామలక్షుమ్మ మాట్లాడారు. పారిశుధ్య పనుల నిర్వహణ, శానిటేషన, వీధిదీపాల పనుల కోసం 14, 15 ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దోచుకుపోవడం ఏమిటని ప్రశ్నించా రు. దీంతో పంచాయతీల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేమన్నారు. స ర్పంచలు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారారని ధ్వజమెత్తారు. నిధులు  తిరిగి పంచాయతీల ఖాతాల్లోకి జమచేయకపోతే రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తామని, హైకోర్టులో కేసులు వేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వీరికి టీడీపీ నాయకులు మద్దతు పలికారు. కార్యక్రమంలో సర్పంచు లు పార్వతమ్మ, నారాయణమ్మ, ఈశ్వరమ్మ, మాజీ ఎంపీపీ వేలూరు రంగ య్య, నాయకులు నాగమునిరెడ్డి, గండికోట లక్ష్మణ్‌, రాజారెడ్డి పాల్గొన్నారు.


గుంతకల్లు టౌన: ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘ నిధులను విడుదల చేయాలని టీ డీపీ సర్పంచలు శ్రీరాములు, శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గురువారం సర్పంచలు నిరసన చేపట్టారు. ఆర్థిక  సంఘం నిధులు విద్యుత బి ల్లులకు చెల్లించడం చట్ట విరుద్ధమన్నారు. ప్రభుత్వ అప్పుల కోసం సర్పంచల నిధులు   మళ్లించడం సిగ్గు చేటన్నారు. అనంతరం ఎంపీడీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొజ్జా నాయక్‌, లాలునాయక్‌, ఆంజినేయులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-03T06:29:13+05:30 IST