ఇంటికి పండుగ కళ ఇలా...

ABN , First Publish Date - 2020-11-12T05:40:08+05:30 IST

పండుగ వేళ ఇల్లంతా కొత్తగా కనిపించాలనుకుంటాం. ప్రధాన ద్వారంతో మొదలు, గోడలు, ఫర్నిచర్‌ అంతా ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అయితే ఖర్చు ఎక్కువ అవుతుందేమోనని వెనక్కి తగ్గుతాం...

ఇంటికి పండుగ కళ ఇలా...

పండుగ వేళ ఇల్లంతా కొత్తగా కనిపించాలనుకుంటాం. ప్రధాన ద్వారంతో మొదలు, గోడలు, ఫర్నిచర్‌ అంతా ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అయితే ఖర్చు ఎక్కువ అవుతుందేమోనని వెనక్కి తగ్గుతాం. కానీ చిన్న చిన్న మార్పులతో, తక్కువ ఖర్చులోనే ఇంటికి పండుగ శోభ తేవచ్చు అంటున్నారు గృహ అలంకరణ నిపుణుడు పంకజ్‌ పొద్దార్‌.. ఆయన ఏం చెబుతున్నారంటే... 




ప్రధాన ద్వారం: ఇంటి అలంకరణను ప్రధాన ద్వారం చెప్పకనే చెబుతుంది. కాబట్టి చెర్రీ దివ్వెలు, పూలతో ప్రధాన ద్వారం తలుపులను అలంకరించాలి. ఇరువైపులా వాల్‌ హ్యాంగర్‌ ్సను వేలాడదీస్తే చక్కగా ఉంటుంది. 



పరదాలతో మాయ: రంగురంగుల పరదాలతో ఇంటికి కొత్త అందం తేవచ్చు. మీ ఇంటికి నప్పేలా ఒకే రంగు లేదా రెండు మూడు రంగులు, షేడ్స్‌లో ఉన్న పరదాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా లేత రంగులో ఉన్నవి లేదా మెరుస్తూ ఉండే వస్త్రంతో తయారైన పరదాలతో పండగ శోభ వస్తుంది.

పూలతో రంగవల్లులు: ఒకపెద్ద పాత్రలో నీళ్లు పోసి, కొన్ని పూల రెమ్మలు వేసి అందులో కొవ్వొత్తులను వెలిగించాలి. అలానే ప్లాస్టిక్‌ పూల బదులు తాజా పూలతో అలంకరిస్తే పండుగ శోభతో పాటు ఇల్లంతా సువాసన నిండుతుంది. రంగులతో ముగ్గులు వేసే బదులు పూలతో పేర్చిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

డైనింగ్‌ టేబుల్‌: ప్రత్యేక సందర్భాల కోసం లోహంతో తయారైన పాత్రలు, గ్లాసులను డైనింగ్‌ టేబుల్‌ మీద ఒక డిజైన్‌లో అమర్చాలి. దాంతో పండుగ రోజు కుటంబసభ్యులకు, బంధువులకు భోజనం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.  

గోడలు: పండుగ అనగానే కొందరు గోడలకు రంగు మళ్లీ వేయిస్తుంటారు. అయితే రంగుల బదులు వాల్‌పేపర్స్‌తో కూడా కొత్త లుక్‌ తేవచ్చు. వివిధ ఆకారాల్లో, రంగుల్లో ఉన్న వాల్‌పేపర్స్‌ ఎంచుకోవాలి. త్రీడి వాల్‌పేపర్స్‌ అయితే సరికొత్తగా ఉంటాయి. ఇంటిలోని ఫర్నిచర్‌, ఫ్లోరింగ్‌, పరదాల రంగును పోలిన వాల్‌పేపర్స్‌ ఎంచుకుంటే బెటర్‌.

Updated Date - 2020-11-12T05:40:08+05:30 IST