నోట్లో ఓ ప్లాస్టిక్ సంచీని పట్టుకుని తిరుగుతున్న శునకం.. ఆ సంచి చిరిగి అందులోంచి పడిన వస్తువును చూసి..

ABN , First Publish Date - 2022-01-01T20:14:23+05:30 IST

ఓ వీధి కుక్క నోటిలో ఉన్న ప్లాస్టిక్ సంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలకలం రేగింది.

నోట్లో ఓ ప్లాస్టిక్ సంచీని పట్టుకుని తిరుగుతున్న శునకం.. ఆ సంచి చిరిగి అందులోంచి పడిన వస్తువును చూసి..

ఓ వీధి కుక్క నోటిలో ఉన్న ప్లాస్టిక్ సంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం ఓ వీధి కుక్క ప్లాస్టిక్ సంచిని నోట కరుచుకుని తిరిగింది. ఒక చోట ఆ సంచి చిరిగి అందులో నుంచి ఓ శిశువు మృతదేహం బయటపడింది. దీంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇండోర్‌లోని అనిల్ శ్రీనగర్‌లో ఈ ఘటన జరిగింది. 


సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోజుల వయసున్న ఓ ఆడ శిశువు మృతదేహాన్ని ఎవరో ప్లాస్టిక్ కవర్‌లో వేసి పారేశారు. దానిని కుక్క తీసుకుంది. ఆ శిశువు మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ఆ శిశువు గురించి స్థానిక ఆస్పత్రుల్లో విచారణ జరుపుతున్నారు.  

Updated Date - 2022-01-01T20:14:23+05:30 IST