రూ.2.24 లక్షల కోట్లు ఆవిరి

ABN , First Publish Date - 2020-11-26T08:06:08+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్టపడింది. గ్లోబ ల్‌ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో ట్రేడర్లు బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఐటీ రంగ షేర్లలో లాభాల స్వీకరణకు దిగారు. దాంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు భారీగా నష్టపోయా యి

రూ.2.24 లక్షల కోట్లు ఆవిరి

8 మార్కెట్లో 3 రోజుల ర్యాలీకి బ్రేక్‌ 


ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్టపడింది. గ్లోబ ల్‌ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో ట్రేడర్లు బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఐటీ రంగ షేర్లలో లాభాల స్వీకరణకు దిగారు. దాంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు భారీగా నష్టపోయా యి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ బుధవారం 694.92 పాయింట్లు కోల్పోయి 43,828.10 వద్దకు జారుకుంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 196.75 పా యింట్లు పతనమై 12,858.40 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో మాత్రం సెన్సెక్స్‌ 44,825.37 వద్ద, నిఫ్టీ 13,145.85 వద్ద సరికొత్త జీవిత కాల గరిష్ఠ స్థాయిలను నమోదు చేసుకున్నాయి. బ్లూచి్‌పలతో పాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లలోనూ ఇన్వెస్టర్లు పెద్దఎత్తున అమ్మకాలకు పాల్పడ్డారు. 


దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 1.76 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.13 శాతం క్షీణించాయి. మొత్తంగా చూస్తే, మార్కెట్‌ వర్గాల సంపద రూ.2.24 లక్షల కోట్లకు పైగా హరించుకుపోయింది. దీంతో బీఎస్‌ ఈ లిస్టెడ్‌ కంపెనీలన్నింటి మార్కెట్‌ విలువ రూ.1,72,56,942 కోట్లకు జారుకుంది. 

Updated Date - 2020-11-26T08:06:08+05:30 IST