అంబులెన్స్‌లో పురుడు పోసిన డ్రైవర్‌

ABN , First Publish Date - 2021-05-14T08:56:27+05:30 IST

కరోనా సోకిన ఓ నిండు గర్భిణి అంబులెన్స్‌లోనే పురుడు పోసుకున్న ఉదంతమిది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన ఓ గర్భిణి కాన్పు కోసం గురువారం జిల్లా ఆస్పత్రికి వచ్చింది

అంబులెన్స్‌లో పురుడు పోసిన డ్రైవర్‌

ఖమ్మం సంక్షేమ విభాగం, మే 13: కరోనా సోకిన ఓ నిండు గర్భిణి అంబులెన్స్‌లోనే పురుడు పోసుకున్న ఉదంతమిది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన ఓ గర్భిణి కాన్పు కోసం గురువారం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు కరోనా నిర్ధారణవడంతో మెరుగైన వైద్యసేవల కోసం వరంగల్‌ ఆస్పత్రికి ప్రభుత్వ అంబులెన్స్‌లో తరలించారు. మార్గమధ్యంలోనే పురిటినొప్పులు రావడంతో డ్రైవర్‌ వెంకట్రావు, అటెండెంట్‌ సాయంతో ఆమెకు కాన్పు చేశాడు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో తిరిగి ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు.

Updated Date - 2021-05-14T08:56:27+05:30 IST