Advertisement
Advertisement
Abn logo
Advertisement

డ్వాక్రా సంఘం డబ్బులను కాజేసిన వారిని శిక్షించాలి

జన్నారం, నవంబరు 30: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మథర్‌థెరిస్సా డ్వాక్రా సంఘం నుంచి దాదాపు రూ.8 లక్షలను కాజేసిన వీవోఏ, సీసీలను శిక్షించాలని తహసీల్‌ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వ హించారు. దాదాపు గంటపాటు రాస్తారోకో చేయడంతో వందలాది వాహనాలు రోడ్డుకు ఇరువైపులా నిలిచిపోయాయి. ఎస్‌ఐ మధుసూదన్‌ సంఘటన స్థలా నికి చేరుకుని మహిళలకు నచ్చజెప్పి విరమింపజేశారు. అనంతరం డ్వాక్రా మహిళలతో కలిసి కార్యాలయానికి వెళ్లి ఏపీఎం బచ్చన్నను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలు భవానీ, రాణి, సుగుణలు మాట్లాడుతూ డబ్బులు కాజేసిన వారి నుంచి రికవరీ చేయాలని పేర్కొన్నారు. ఏపీఎం బుచ్చన్న మాట్లాడుతూ డ్వాక్రా సంఘంలో అక్రమాలు జరిగింది వాస్త వమేనని, రూ. 7,90,000 అక్రమానికి గురి కావడంతో ఇప్పటి వరకు దాదాపు రూ.5 లక్షలను సీసీ కొమురవెల్లి, వీవో సుమన్‌ వద్ద నుంచి రివకరీ చేయించా మన్నారు. మిగితా వాటిని త్వరలో రికవరీ చేస్తామని తెలిపారు. 

Advertisement
Advertisement