మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-17T07:02:21+05:30 IST

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు పథకాలను సద్వినియోగం చేసుకుని ఆదిశగా అడుగులు వేయాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి పేర్కొన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధే  ప్రభుత్వ లక్ష్యం
మాట్లాడుతున్న మానుగుంట మహీధర్‌రెడ్డి

కందుకూరు : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు పథకాలను సద్వినియోగం చేసుకుని ఆదిశగా అడుగులు వేయాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. కందుకూరు మండలంలోని పొదుపు గ్రూపుల మహిళలకు చెక్కులు అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి వారినుద్ధేశించి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటిలో మహిళలనే లబ్దిదారులుగా గుర్తించడం ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి చెందుతారన్నారు. మహిళలు ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  కార్యక్రమంలో తహసీల్దార్‌ డి.సీతారామయ్య, ఎంపీపీ ఇంటూరి సుశీల, జడ్పీటీసీ తొట్టెంపూడి అనసూర్య, వెలుగు అధికారులు పాల్గొన్నారు. 

ఆసరా చెక్కుల పంపిణీ

పోకూరు (వలేటివారిపాలెం) :  మండలంలోని పోకూరు హైస్కూల్‌లో శుక్రవారం వెలుగు ఏపీఎం దేవరాజ్‌ అధ్యక్షతన రెండవ విడత వైఎస్‌ఆర్‌ ఆసరా చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ  చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పొనుగోటి మౌనిక, జడ్పీటీసీ సభ్యురాలు ఇంటూరి భారతి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ముప్పా హరిత, కోశాదికారి మన్నం వెంగమ్మ, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T07:02:21+05:30 IST