విద్యా, వైద్య రంగాలను బలోపేతం చేయాలి

ABN , First Publish Date - 2021-10-25T06:15:01+05:30 IST

విద్యా, వైద్య రంగాల ను ప్రభుత్వం బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో స్థాని క తెలంగాణ పెన్షనర్స్‌ భవన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

విద్యా, వైద్య రంగాలను బలోపేతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి 


భువనగిరి రూరల్‌, అక్టోబరు 24: విద్యా, వైద్య రంగాల ను ప్రభుత్వం బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో స్థాని క తెలంగాణ పెన్షనర్స్‌ భవన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా, వైద్యం రంగాలను ప్రభు త్వం కార్పొరేట్‌ శక్తులకు ధారదత్తం చేయడంతో అవి సంపన్నవర్గాలకే అందుతున్నాయని ఆరోపించారు. అనంతరం తెలంగాణ పౌరస్పందన వేదిక జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కాట స్లీవరాజు, ఉపాధ్యక్షులుగా జిట్టా భాస్కర్‌రెడ్డి, కాచరాజు జయప్రకాశ్‌ రాజు, ప్రధాన కార్యదర్శిగా ఎండీ.అలీముద్దీన్‌, కార్యదర్శిగా రాదారపు రాజును ఎన్నుకున్నా రు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.రాధేశ్‌ శ్యాం, జె. రాజశేఖర్‌, ఎం.జంగయ్య, వెంకటేశ్‌, అయిలయ్య, సాగర్‌, హరికిషన్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T06:15:01+05:30 IST