Abn logo
Sep 21 2021 @ 23:55PM

ఎన్నికల కమిషన్‌ నియమావళిని పాటించాలి

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

ఆదిలాబాద్‌టౌన్‌, సెప్టెంబరు 21: ఆరోగ్యవంతమైన ఓటరు జాబితా సిద్ధం చేయడానికి బూత్‌ స్థాయి అధికారులు ఎన్నికల కమిషన్‌ నియమావళిని పాటించాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బూత్‌ స్థాయి అధికారులకు, సూపర్‌వైజర్‌లకు 2022 ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం, బూత్‌ స్థాయి అధికారుల రిజిస్టర్‌ల నవీకరణ, ఆరోగ్యవంతమైన ఓటరు జాబితా సిద్ధం చేయడం, గరుడ యాప్‌ డౌన్‌లోడ్‌ నిర్వహణ అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఎన్నికల కమిషన్‌ నియామావళిని అనుసరించి ఓటరు జాబితాను తయారు చేయాలన్నారు. ఫారం-6, 6ఏ, 7, 8, 8ఏలు అందిన వాటిని పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు. 2022 ప్రకారం ఓటరు జాబితాను తయారు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి బూత్‌ స్థాయి అధికారి గరుడయాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వాటిని సమర్థవంతంగా వినియోగించాలన్నారు. అంతకు ముందు ప్రత్యేక ఓటరు నమోదు 2022, రిజిస్టర్‌ల నిర్వహణ, ఆరోగ్యపరమైన ఓటరు జాబితా సిద్ధం చేయడం వంటి అంశాలపై మాస్టర్‌ ట్రైనర్‌ లక్ష్మణ్‌ బూత్‌ స్థాయి అధికారులకు వివరించారు. అనంతరం గరుడయాప్‌ వినియో గంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్‌ తహసీల్దార్‌ భోజన్న, ఎన్నికల విభాగం నాయబ్‌ తహసీల్దార్‌ మహేష్‌, బూత్‌ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.