Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘స్థానిక’ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

రఘురాం, అరుణ్‌కుమార్‌లకు పలువురి అభినందనలు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)  : జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా వైసీపీ అభ్యర్థులు తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జేసీ క్యాంపు కార్యాలయంలో వీరిద్దరికీ రిటర్నింగ్‌ అధికారిణి కె.మాధవీలత ధ్రువీకరణ పత్రాలను అందించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఉండడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. నూతన ఎమ్మెల్సీలకు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, రాష్ట్ర మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, కురసాల  కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కైలే అనిల్‌ కుమార్‌, దూలం నాగేశ్వరరావు, మొండితోక జగన్మోహన్‌రావు, జోగి రమేష్‌, మల్లాది విష్ణు తదితరులు అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement