విద్యుత్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి..

ABN , First Publish Date - 2021-10-18T06:00:58+05:30 IST

విద్యుత్‌ సవరణ చట్టం 2021 ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (1104 యూనియన్‌) నాయకులు డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి..

ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌

కదిరిఅర్బన్‌, అక్టోబరు 17: విద్యుత్‌ సవరణ చట్టం 2021 ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (1104 యూనియన్‌) నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆ యూనియన్‌ కదిరి డివిజన్‌ ఆధ్వర్యంలో స్థానిక పవర్‌హౌస్‌ కాంపౌండ్‌లో కదిరి డివిజన్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు అధ్యక్షతన జరుగగా, ముఖ్య అతిధిగా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ విద్యుత్‌ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభు త్వం ప్రతిపాదించే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగ సంఘాలను సంప్రదిం చలేదన్నారు. అయితే పెట్టుబడి దారుల ప్రతినిధులను సంప్రదించడం దారుణ మన్నారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు సమైక్య స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా ఉందని విమర్శించారు. ప్రైవేటీకరణ వల్ల వచ్చే నష్టాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి పోరాటాలకు సన్నద్దం చేయాలని పిలుపునిచ్చారు. విద్యుత్‌ రంగాల పై రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందన్నారు. ప్రైవేటు సంస్థల ప్రయోజనాల కోసమే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోందన్నారు. సవరణ బిల్లు చట్టమై అమలులోకి వస్తే వారు ఎవరికైనా లైసెన్స్‌ ఇస్తే వారు ఎక్కడ నుంచి అయినా విద్యుత్‌ను కొనుగోలు చేయ వచ్చు, ఎవరికైనా విద్యుత్‌ సరఫరా చేయవచ్చు. దీంతో అరాచకం మొదలై ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల ప్రాబల్యం తగ్గిపోతుందన్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులను క్రమబద్దీక రించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న గ్రేడ్‌-2 ఎనర్జీ అసిస్టెంట్స్‌ సర్వీసును క్రమబద్దీకరించాలన్నారు. విద్యుత్‌ ఉద్యోగులకు రావాల్సిన డీఏ మరియు విద్యుత్‌ సంస్థలలో మేనేజ్‌మెంట్‌ తీసుకుంటున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు. లేని పక్షంలో పోరాటాలకు పోరుబాట తప్పద న్నారు. ఈ కార్యక్రమంలో కదిరి డివిజన్‌ ప్రెసిడెంట్‌ సోమనాథ్‌శేఖర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జయరాంనాయక్‌, సెక్రటరీ రమేష్‌నాయక్‌, అడిషనల్‌ సెక్రటరీ గంగిరెడ్డి, అడ్వైజర్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T06:00:58+05:30 IST