లుంగీల లావణ్యం

ABN , First Publish Date - 2020-11-04T06:17:22+05:30 IST

కొబ్బరిబోండాలో కమ్మని నీళ్లతో పాటు... టెంకకు అతుక్కొని లేలేత కొబ్బరి కూడా ఉంటుంది కదా! ఎంతో రుచిగా...

లుంగీల లావణ్యం

కొబ్బరిబోండాలో కమ్మని నీళ్లతో పాటు... టెంకకు అతుక్కొని లేలేత కొబ్బరి కూడా ఉంటుంది కదా! ఎంతో రుచిగా... నోరూరిస్తుంటుందా కొబ్బరి. ఆ కొబ్బరి స్ఫూర్తితోనే ఓ సంస్థ తమ ఫ్యాషన్‌ బ్రాండ్‌కు ‘మలాయ్‌’ అని పేరు పెట్టుకుంది. వినూత్నమైన డిజైన్లతో ఓ కలెక్షన్‌ కూడా రూపొందించింది. ఇటీవల  ‘లాక్మే ఫ్యాషన్‌ షో’లో వాటిని ప్రదర్శించింది. షో మొత్తానికీ హైలైట్‌గా నిలిచిన ఈ కలెక్షన్‌లో అందరినీ కట్టిపడేసింది మాత్రం లుంగీ డ్రెస్సులే!




మగవారే కాదు... ఆడవారు కూడా ఈ ‘లుంగీ’లేసుకుని అదరగొట్టారు. డిజైనర్లయితే వీటిని లుంగీలని అనడంలేదు కానీ... ఆ మధ్య సూపర్‌హిట్‌ అయిన ‘లుంగీ డ్యాన్స్‌’ పాటను ఊహించుకొంటూ వీటిని డిజైన్‌ చేసినట్టే ఉంది. పువ్వులు, గ్రాఫిక్స్‌, మెరిసే అంచులు... లుంగీ అదే... కానీ దానిపై డిజైన్లు మాత్రం ఎన్నో. వాటికి జతగా టీషర్ట్‌లు, కలర్‌ఫుల్‌ టాప్స్‌తో మోడల్స్‌ మెరిసి మురిపించారు.


 విశేషమేమంటే ల్యాప్‌టాప్‌ బ్యాగ్స్‌, హ్యాండ్‌బ్యాగ్స్‌, బెల్ట్‌లు, పౌచ్‌లు... ఇలా షోలో ప్రదర్శించినవన్నీ పరిపక్వత చెందిన కొబ్బరికాయ నీళ్లలోని సెల్యులోజ్‌ బ్యాక్టీరియా ఆధారిత బయోకంపోజిట్‌ మెటీరియల్‌తో తయారుచేసినవే.


Updated Date - 2020-11-04T06:17:22+05:30 IST