కరోనా అంతం.. ఆరంభం

ABN , First Publish Date - 2021-01-17T06:23:58+05:30 IST

ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వైరస్‌ అంతం ఆరంభమైంది. ఇన్నా ళ్లు ఎప్పుడెప్పుడా? అని ఎదరు చూసిన కరోనా నివారణ టీకా అందుబాటులోకి రానే వచ్చింది. శనివారం జిల్లాలో మొ దటి విడత వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

కరోనా అంతం.. ఆరంభం
కొవిడ్‌ టీకాను ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌

జిల్లాలో మొదటి విడత కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతం

తొలిరోజు ప్రశాంతంగా టీకా పంపిణీ

ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం ప్రారంభమైన కార్యక్రమం

దశల వారీగా టీకా పంపిణీకి ఏర్పాట్లు

మొరాయించిన కరోనా సైట్‌.. ఆఫ్‌లైన్‌లోనే వివరాల నమోదు

ఫిబ్రవరి 13న రెండో డోసు పంపిణీ

ఆదిలాబాద్‌, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వైరస్‌ అంతం ఆరంభమైంది. ఇన్నా ళ్లు ఎప్పుడెప్పుడా? అని ఎదరు చూసిన కరోనా నివారణ టీకా అందుబాటులోకి రానే వచ్చింది. శనివారం జిల్లాలో మొ దటి విడత వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా మూడు వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ని రిమ్స్‌ ఆసుపత్రితో పాటు శాంతినగర్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ఉట్నూర్‌ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో కరోనా నివారణ టీకాను అందించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ప్రధాని మోదీ  ప్రసంగం.. 11.05 గంటలకు పూర్తయింది. అనంతరం ఎంపీ సోయంబాపురావ్‌, జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌, ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ లు వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో మొదట వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న సర్వేలైన్స్‌ అధికారి వైసీ శ్రీనివా్‌సకు కొవిడ్‌ షీల్డ్‌ టీకాను వేశారు. అంతేకాకుండా, ఆ తర్వాత ఉట్నూర్‌ సీహెచ్‌సీ, శాంతినగర్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలోనూ టీకా పంపిణీ కార్యక్రమం మొదలైంది. సాయంత్రం 4గంటల వరకు జిల్లాలో 90మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ను పూర్తి చేశారు. 

జిల్లాలో కొవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌

జిల్లాలో కరోనా వైరస్‌ కట్టడికి కొవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌ వేశారు. ముందుగా గుర్తించిన రిమ్స్‌, శాంతినగర్‌, ఉట్నూర్‌ ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టారు. ఒక్కో కేంద్రంలో 30 మంది చొప్పున.. మొత్తం జిల్లా వ్యాప్తంగా 90మందికి కరోనా నివారణ టీకాను అందించా రు. ఇందులో జాబితాలో ఉన్న వారు కాకుండా, 21 మంది కొత్త వారిని పి లిపించి వ్యాక్సినేషన్‌ చేశారు. ఉట్నూర్‌ సీహెచ్‌సీలో 10మంది కొత్త వారికి అందించగా, శాంతినగర్‌ పీహెచ్‌సీలో ఐదుగురు, రిమ్స్‌లో ఐదుగురు వైద్యసిబ్బంది వ్యాక్సినేషన్‌కు హాజరుకాక పోవడంతో రెండో జాబితాలో ఉన్న అధికారులను పిలిపించి టీకా వేశారు. వ్యాక్సినేషన్‌ వేసుకున్న వారందరికీ మళ్లీ 28 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 13న రెండో డోసును అందించనున్నారు. గడువుకు ముందే కరోనా టీకా తీసుకున్న వారందరికీ మెసేజ్‌ను పంపించి సకాలంలోనే రెండో డోస్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఆఫ్‌లైన్‌లోనే వివరాల నమోదు

కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారందరి వివరాలను ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కరోనా సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాని కరోనా సైట్‌ మోరాయించడంతో.. తొలి రోజు ఆఫ్‌లైన్‌లోనే అధికారులు వివరాలను నమోదు చేస్తూ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి వ చ్చింది. మొదట గుర్తించిన 90మంది వైద్య సిబ్బందిలో కొత్తగా 21మంది సిబ్బందికి వ్యా క్సినేషన్‌ చేశారు. సాంకేతిక లోపాల కారణంగానే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడం లే దని అధికారులు చెబుతున్నారు. వారంలో బుధ, శని రెండు రోజులు మినహా, మిగిలిన రోజుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కొనసాగించనున్నారు. 

తెలుగులో మోదీ ప్రసంగం

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గురజాడ అప్పారావ్‌ను గుర్తు చేసుకుంటూ ‘సొంత లాభం కొంత మానుకో.. పొరుగు వారి మేలు కోరుకో, దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’ అంటూ తెలుగులో ప్రసంగించారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులు, నేతలంతా ప్రధాని మాటలు విని ఆశ్చర్యపోయారు. అందరూ కరోనా వ్యాక్సినేషన్‌ చేసుకునే విధంగా అధికారులు, నేతలు ప్రచారం చేయాలంటూ సూచించారు. దాదాపుగా 30నిమిషాల పాటు మోదీ ప్రసంగం కొనసాగింది. అనంతరం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు.

ఉన్నతాధికారుల ఆదేశాలతోనే మార్పులు

: నరేందర్‌ రాథోడ్‌, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్‌

జిల్లాలో తొలిరోజు 90మందికి కరోనా వ్యాక్సినేషన్‌ చేసేందుకు జాబితా ను సిద్ధం చేశాం. అయినా కొందరు వ్యాక్సినేషన్‌కు హాజరుకాక పోవడంతో వారి స్థానంలో ఇతరులకు వ్యాక్సినేషన్‌ వేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నాం. కరోనా సైట్‌ మోరాయించడంతో లబ్ధిదారుల వివరాలు నమోదు చేసేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. సోమవారం ఈ మూడు కేంద్రాల్లోనే మళ్లీ 90 మందికి వ్యాక్సినేషన్‌ వేసేందుకు జాబితాను సిద్ధం చేస్తున్నాం. 

ప్రజల్లో భయాన్ని పొగొట్టేందుకే ముందుగా టీకా

: డా.వైసీ శ్రీనివాస్‌, జిల్లాలో తొలి వ్యాక్సినేషన్‌ వేసుకున్న అధికారి

ప్రజల్లో కరోనా వ్యాక్సినేషన్‌ పట్ల ఉన్న భయాన్ని పోగొట్టేందుకే ముందుగా టీకా తీసుకున్నా. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్‌ అంతం చేసేందుకు వ్యాక్సిన్‌ ఎంతో తోడ్పడుతుంది. ముందుగా టీకా తీసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం టీకా తీసుకున్న వారందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేవు. అందరి ఆరోగ్య పరిస్థితులు నిలకడగానే ఉన్నాయి. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ లేకపోవడం మంచి పరిణామం. త్వరలోనే జిల్లా ప్రజలందరికీ వ్యాక్సి నేషన్‌ అందే విధంగా చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2021-01-17T06:23:58+05:30 IST