Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇద్దరు స్నేహితులు.. ఒకే మహిళతో వివాహేతర సంబంధం.. చివరకు ఇప్పుడు ఆ కుర్రాళ్ల పరిస్థితి ఏంటంటే..

స్నేహితుల మధ్య మంచి అనుబంధం ఉండాలే గానీ ఈర్ష, ద్వేషం ఉండకూడదు. అయితే ఒక్కోసారి ఎంత మంచి స్నేహితులైనా చివరకు శత్రువుల్లా మారుతుంటారు. అందులోనూ ప్రేమ వ్యవహారాల విషయంలో ఎక్కువగా గొడవలు జరుగుతుంటాయి. ఇలాగే రాజస్థాన్‌లో ఇద్దరు స్నేహితులు.. ఒకే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఒకరికి తెలీకుండా ఒకరు ఆమెతో అక్రమ సంబంధాన్ని కొనసాగించేవారు. చివరికి ఆ కుర్రాళ్ల పరిస్థితి ఏమైందో తెలుసుకుందాం..

పోలీసుల అదుపులో నిందితులు

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా రబాసర్‌లోని ధనౌ గ్రామానికి చెందిన మీర్‌ఖాన్ అనే యువకుడు, వాసన్‌ఖాన్ స్నేహితులు. ఈ క్రమంలో ఇధ్దరూ కలిసి అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఒకరికి తెలీకుండా ఒకరు ఆమెతో శారీరకంగా కలిసేవారు. ఆమె కూడా ఒకరి విషయం మరొకరికి చెప్పకుండా వారితో రహస్యంగా కలిసేది. ఈ క్రమంలో ఓ రోజు నిందితుడికి విషయం తెలిసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

మహిళను మరచిపోవాలని వాసన్‌ను.. మీర్‌ఖాన్ హెచ్చరించాడు. అయితే వాసన్ మాత్రం ఆమెతో తరచూ కలుస్తుండేవాడు. దీంతో వాసన్‌పై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 15వ తేదీన తన స్నేహితులైన రామ్‌దాన్, బర్ఖా, హకం, ధనౌలో నివాసం ఉంటున్న రోషన్‌కు కాల్ చేసి పిలిపించాడు. తర్వాత వాసన్‌కు కాల్ చేసి పనుందంటూ మాట్లాడాలని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ మహిళ విషయమై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా వాసన్‌పై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన వాసన్.. గుజరాత్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement