Abn logo
Sep 26 2021 @ 00:39AM

బ్లాస్టింగ్‌ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న సీఐటీయూ నేతలు

రామగిరి, సెప్టెంబర్‌ 25: సింగరేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్‌ పరిధిలోని ఓసీపీ -1 బ్లాస్టింగ్‌లో ప్రాణాలను కొల్పోయిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ఆర్జీ-3జీఎం కార్యాలయం ఎదుట సీఐటీయూ నాయకులు ధర్నా చేపట్టారు. మరణించిన కాంట్రాక్టు కార్మి కులకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపులో జాప్యంపై ఆందోళన  చేపట్టారు. విధులకు వెళ్లే అధికారులను అడ్డుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. జీఎం కా ర్యాలయం ఎదుట కార్మిక నేతల ఆందోళనపై స్పందించిన జీఎం మనోహర్‌ ఫోన్‌లో సీఐటీయు నేతలతో మాట్లాడారు. డివిజన్‌లోని ఓసీపీ-1లో జరిగిన ఘ టనతో పాటు కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై కొత్తగూడెంలో జరిగే బోర్డ్‌ఆఫ్‌ డైరెక్టర్‌ల సమావేశంలో చర్చిస్తానని హామీ ఇవ్వడంతో సీఐటీయూ నేతలు శాం తించారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెల్పుల కుమారస్వామి, నా యకులు కొంరయ్య, కుమార్‌, రమేశ్‌, వెంకటేష్‌, బాలు, విలాసిని, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.