May 14 2021 @ 10:34AM

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ రిలీజ్ డేట్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నటించిన యాక్షన్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ రిలీజ్ డేట్‌కు సంబంధించిన వార్తొకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం ఓటీటీల్లో స్టార్స్‌ అందరూ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వీరి బాటలోనే సమంత అక్కినేని ఓటీటీలో అడుగు పెట్టింది. ఇప్ప‌టికే తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో సామ్ జామ్ వెబ్ షోకు సమంత వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హరించింది. అలాగే దర్శకులు రాజ్‌, డీకే తెరకెక్కించిన వెబ్‌ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సీజన్‌ 2లో సమంత అక్కినేని .. రాజీ అనే టెర్రరిస్ట్‌ పాత్రలో నటించింది. దీనికి సంబంధఇంచి సమంత లుక్ కూడా బయటకు వచ్చింది. తాజా సమాచారం మేరకు.. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ జూన్ 11న అమెజాన్‌లో ప్రసారం అవుతుంది. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటించారు.