Abn logo
Sep 25 2021 @ 19:01PM

ఇంజినీరింగ్ చేయమంటే వినలేదు.. కానీ దేశ విదేశాల్లో ఆమె పేరు మారుమోగుతోంది.. ఆ మిడిల్ క్లాస్ అమ్మాయి సక్సెస్ సీక్రెట్ ఇదేనట..

ఇంటర్నెట్ డెస్క్: పిల్లలు పుట్టడంతో కొందరు తల్లిదండ్రుల మనసులో ఓ ఆలోచన మొలకెత్తుతుంది. తమ బిడ్డను ఏ డాక్టర్‌గానో లేక ఇంజినీర్‌గానో చూడాలనుకుంటారు. అందుకు తగ్గ ఉన్నత చదువులు చదివించేందుకు ప్రణాళికలు కూడా రూపొందించేసుకుంటారు. ఈ క్రమంలో పెద్దయ్యాక ఆయా రంగాలపై తమ బిడ్డలకు ఆసక్తి ఉంటుందా లేదా అనే విషయాన్ని అస్సలు పట్టించుకోరు. గుజరాత్‌కు చెందిన పాయల్ పటేల్ తల్లిదండ్రులు కూడా ఈ కోవలోకే చెందుతారు. తమ బిడ్డను ఇంజనీర్‌గా చూడాలనుకున్నారు. అయితే ఆమె మాత్రం.. అందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. తల్లిదండ్రుల సహకారం లేకున్నా.. తనకు ఇష్టమైన రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం అందులో రాణిస్తున్నారు. దీంతో దేశ విదేశాల్లో ఆమె పేరు మారుమోగుతోంది. ఈ క్రమంలో నెలకు లక్షలాది రూపాయలను సంపాదిస్తున్న పాయల్ పటేల్ సక్సెస్ స్టోరీ ఆమె మాటల్లోనే.. 


‘మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా డిప్లొమా పూర్తైన తర్వాత చాలా మంది తల్లిదండ్రులలాగే మా అమ్మానాన్న కూడా నన్ను ఇంజినీరింగ్ చదివించాలనుకున్నారు. అయితే నాకు ఇంజినీరింగ్‌పై అస్సలు ఆసక్తి లేదు. చిన్నప్పటి నుంచి జుత్తును రకారకాల స్టైల్స్‌లో వేసుకుంటూ ఉండేదాన్ని. అది క్రమంగా ఇష్టంగా మారింది. ఈ క్రమంలోనే హెయిర్ స్టైలిస్ట్‌గా మారాలని డిసైడ్ అయ్యాను. అయితే నా నిర్ణయం మా అమ్మానాన్నలకు నచ్చలేదు. కానీ నేను మాత్రం వెనక్కి తగ్గలేదు. నా ప్రయత్నాలను నేను కొనసాగించాను. హెయిర్ స్టైలిస్ట్‌గా మారడం కోసం శిక్షణ తీసుకోవడాన్ని ప్రారంభించాను. ఈ నేపథ్యంలో నా తల్లిదండ్రులు కూడా నాకు మద్దతుగా నిలిచారు. ఖర్చుల కోసం మా నాన్న లక్ష రూపాయలను ఇచ్చారు. అనంతరం 2015లో సూరత్‌లో బ్యూటీ పార్లర్‌ను నెలకొల్పాను. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఇంటింటికీ తిరిగి పాంప్లేట్లు కూడా పంచాను. దీంతో బ్యూటీ పార్లర్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య పెరిగింది. వచ్చిన కస్టమర్లు హెయిర్ స్టైల్‌కు సంబంధించిన విషయాలపై పదే పదే ప్రశ్నలు అడిగేవారు. దీంతో హెయిర్ స్టైలిస్ట్ ట్రైనింగ్ సెంటర్‌ను నెలకొల్పాను. దానికి మంచి ఆధరణ లభించింది. దుబాయి, మలేషియా, ఆఫ్రికా తదితర దేశాలకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌లు సంప్రదిస్తూ తమ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాయి. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ ట్రైనింగ్‌ను కూడా ప్రారంభించాను. ఇప్పటి వరకు 10వేల నుంచి 15 వేల మందికి శిక్షణ ఇచ్చాను. ఆదాయం కూడా బాగానే ఉంది. సినిమా రంగం, ఎలక్ట్రిక్ మీడియా రంగం, పెద్ద పెద్ద హోటళ్లు, క్లబ్‌లు, నైట్ పర్టీలు పెద్ద పెద్ద మెట్రో నగరాల్లో హెయిర్ స్టైలిస్ట్‌లకు మంచి డిమాండ్ ఉంది’ అంటూ పాయల్ పటేల్ చెప్పుకొచ్చారు. 


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...