పోలీసులు ఇంటికి రావడంతో గుండెపోటుతో రైతు మృతి

ABN , First Publish Date - 2021-06-23T07:36:58+05:30 IST

హద్దు రాళ్ల తొలగింపు కేసులో కుమారులపై నమోదైన కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసులు ఇంటికిరాగ మనోవే దనకు గురైన వ్యక్తి గుండెపోటుకు కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు.

పోలీసులు ఇంటికి రావడంతో గుండెపోటుతో రైతు మృతి
ఆంజయ్య ఫైల్‌ ఫొటో (ఇన్‌సెట్లో)

కారకులపై చర్యలు తీసుకోవాలని  మృతుడి బంధువుల ధర్నా

జడ్పీ వైస్‌ చైర్మన్‌, ఆయన కుమారుడిపై  పోలీసులకు ఫిర్యాదు

హాలియా, జూన్‌ 22:హద్దు రాళ్ల తొలగింపు కేసులో కుమారులపై నమోదైన కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసులు ఇంటికిరాగ మనోవే దనకు గురైన వ్యక్తి గుండెపోటుకు కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు,  ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా అనుముల మండలం యాచారం గ్రామానికి చెం దిన సింగారపు అంజయ్య(60) కుటుంబానికి  గ్రామ శివారులో 30 గంటల భూమి ఉంది. మరో 30 గుంటల భూమిలో కబ్జాలో  ఉన్నా రు. అంజయ్య కబ్జాలో ఉన్న భూమికి రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని నమ్మ బలికి 15 గుంటల భూమిని జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరికి పెద్దులు, ఆయన కుమారుడు నరేష్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.  దీంతో ఇరువర్గాల మధ్య వివాదం మొదలైంది. తన భూమి హద్దు రాళ్లు తొలగించారని పెద్దులు కొన్ని రోజుల క్రితం హాలియా పోలీస్‌ స్టేషన్‌లో  అంజయ్య, అతని తమ్ముడు శంకర్‌, కుమారుడు రాజశేఖర్‌లపై  ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు మంగళవారం ఉదయం అంజయ్య ఇంటికి వచ్చారు. ఉద్యోగం చేస్తున్న కుమారుడు రాజశేఖర్‌పై కేసు పెట్టారని ఆవేదనకు గురైన అంజయ్య గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన  బంధువులు అంజయ్య మృత దేహాన్ని అంబులెన్సులో హాలియా పోలీస్‌ స్టేషన్‌కు తరలించి ఆందోళన చేయడానికి యత్నించారు. అయితే అంబులెన్సును మార్గవ ుధ్యంలోని పెద్దగూడెం స్టేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.  ఇరిగి పెద్దులు, ఆయన కుమారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంజయ్య బంధువులు హాలియా ప్రధాన సెంటర్‌లో ధర్నా చేశారు. భర్త  అంజయ్య మృతికి జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, ఆయన కుమారుడు ఇరిగి నరేష్‌లు కారణమని భార్య ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. తన కబ్జాలో ఉన్న భూమి హద్దు రాళ్లను అంజయ్య కటుంబసభ్యులు తొలగిస్తే ఈ విషయమై హాలియా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఇరిగి పెద్దులు తెలిపాడు. వాస్తవాలను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు. 




Updated Date - 2021-06-23T07:36:58+05:30 IST