Abn logo
May 24 2020 @ 04:52AM

డిమాండ్‌ ఉన్న పంటలనే సాగుచేద్దాం

వ్యవసాయంరంగంలో కొత్త తెలంగాణ పుంతలు

సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో రైతన్న ముందడుగు

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌


రఘునాథపాలెం మే 23: తెలంగాణలో వ్యవసాయరంగాన్ని కొత్తపుంతలు తోక్కించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగులో చేస్తున్న మార్పులు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని వీవీ పాలెం, మంచుకొండ గ్రామాల్లో రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు పండిస్తున్న పంట ఏ ఒక్క గింజ మిగలకుండా డిమాండ్‌ రేటుకు అమ్ముడుపోయోలా ఉండాలన్నారు. ఇష్టానుసారంగా చేస్తున్న వ్యవసాయంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మార్కెట్‌ సమయంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, గిట్టుబాటుధర లేక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు సమగ్రంగా పరిశీలించిన తరువాత ముఖ్యమంత్రి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.


పెరుగుతున్న జనాభ ఆధారంగా పత్తికి చాలా డిమాండ్‌ ఉంటుందన్నారు. లాభదాయక పంటలను సాగుచేయటం ద్వారా రైతుల ఆర్థిక పరిపుష్టి సాధిస్తారన్నారు. తెలంగాణలో వ్యవసాయరంగానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేస్తున్న కృషిని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు రైతన్నకోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఏరాష్ట్రంలో లేవన్నారు. కార్యక్రమంలో ముందుగా రైతులు, అధికారుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జీలుగులను, సబ్‌మర్శబుల్‌ మోటార్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్‌ కురాకుల నాగభూషణం, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, రైతు సమన్వయసమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి ఝాన్సీలక్ష్మీకుమారి, ఆత్మ పడీ విజయనిర్మల, జిల్లా ఉద్యానశాఖాధికారి అనసూర్య, ఎంపీపీ భూక్యా గౌరి, వైస్‌ ఎంపీపీ గుత్తా రవికుమార్‌, జడ్పీటీసీ ప్రియాంక, వీవీ పాలెం సర్పంచ్‌ రావెళ్ల మాధవి, ఎంపీటీసి యరగర్ల హన్మంతరావు, మంచుకొండ సొసైటీ అధ్యక్షుడు మందడపు సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement