కందులు వేస్తున్న రైతులు

ABN , First Publish Date - 2020-06-04T09:58:43+05:30 IST

తొలకరి పలుకరించింది.. ఏరువాకకు ముందే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోకి అడుగు పెట్టడంతో, వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది..

కందులు వేస్తున్న రైతులు

సాగుకు సన్నద్ధం

ఉమ్మడి పాలమూరు జిల్లాను పలుకరించిన తొలకరి వర్షాలు

నూతన సాగు విధానంతో ప్రణాళిక ఖరారు

వానాకాలం పంటలకు దుక్కులు సిద్ధం చేసిన రైతులు

గతేడాదికంటే పెరిగిన సాగు విస్తీర్ణం

వరి సాగును తగ్గించని ప్రభుత్వం

మొక్కజొన్న విషయమై ఇంకా తొలగని సందిగ్ధత

కంది, పత్తి సాగు పెంచే యోచన


వనపర్తి, ఆంధ్రజ్యోతి :

తొలకరి పలుకరించింది.. ఏరువాకకు ముందే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోకి అడుగు పెట్టడంతో, వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.. ఆకాశం మబ్బులు కమ్ముకొని జల్లులు కురిపిస్తుండటంతో రైతాంగం వానాకాలం సాగుకు సన్నద్ధమైంది.. ఇప్పటికే దుక్కులు రెడీ చేయగా, విత్తనాలు వేసుకునేందుకు సిద్ధమైంది.. తొలకరి తరువాత ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగం దీర్ఘకాలిక పంటలను సాగు చేస్తుంది.. కానీ, నూతన సాగు విధానంతో ప్రభుత్వం ఈసారి కంది, పత్తి సాగును ప్రోత్సహిస్తుండటంతో రైతాంగం ఉత్సాహం కనబరుస్తోంది.. అయితే ప్రతి ఏటా ఈ సీజన్‌లో మొక్కజొన్న సాగు చేసే రైతులు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు.. మొక్కజొన్న సాగు చేస్తే రైతుబంధు రాదని, కొనుగోళ్లు చేపట్టదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో డైలమాలో పడ్డారు.. ఒకవేళ కంది, పత్తి సాగు చేస్తే రెండో పంటకు తక్కువ అవకాశాలు ఉంటాయని, ఒక్క పంటతో లాభాల మాట అటుంచితే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..


ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఐదు జి ల్లాల పరిధిలో 19.89 లక్షల ఎకరాలను ఈ వానా కాలంలో సాగు చేయడానికి ఆయా జిల్లాల వ్యవ సాయ శాఖ అధికారులు ప్రణాళిక ఖరారు చేశారు. ఇందులో మొక్కజొన్నకు ఒక్క ఎకరా కూడా కే టాయించ లేదు. ఆ స్థానంలో కంది, పత్తి సాగును పెంచుతున్నట్లు ప్రకటించారు. వరి సాగులో మా త్రం తగ్గిం పు ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లాలో 3.76 ల క్షల ఎకరాల్లో వరి సాగు చే యాలని నిర్ణయించగా, సగటు న 65 శాతం వరకు ఈసారి సన్నాలు సాగు చేపట్టనున్నా రు. ఇందులో సగం వరకు తె లంగాణ సోనా ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకాలను సాగు చే యాలని నిర్ణయించారు. ప్ర స్తుతం వరి సాగుకు ఇంకా స మయం ఉంది. ఇప్పుడు ఆరు తడి పంటలైన ప త్తి, కంది, జొన్న, ఆముదం సా గు కోసం విత్తనాలు వేయాల్సి ఉంటుం ది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లా రైతులు దుక్కులు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు.


మొక్కజొన్నపై ఇంకా ఆశలు

మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాల్లో మొక్కజొ న్న సాగు ఎక్కువ. వనపర్తి జిల్లాలో మూడేళ్లుగా మొక్కజొన్న సా గు 55 వేల ఎకరాల నుంచి 16 వేలకు పడిపోయింది. గత వానా కాలంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో 62,828, నాగర్‌కర్నూలు జిల్లాలో 93,051 ఎకరాల్లో, అన్ని జిల్లాల్లో కలిపి 1.90 లక్షల ఎకరాల్లో మొక్కజొ న్న సాగైంది. అయితే వానాకాలం మొక్కజొన్న పంటకు డిమాండ్‌ లేని కారణంగా ఈ పంటను వేయొద్దని, యాసంగిలో వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. సాగు ప్రణాళిక నుంచి మొక్కజొన్నను తొలగించింది. ఒకవేళ సాగు చేస్తే రైతుబంధు ఇవ్వమని, కొనుగోళ్లు కష్టమని రైతులకు తేల్చి చె ప్పింది. అయితే ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల రైతులు మొక్కజొన్న సా గు వద్దనడడంపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీని స్థానంలో ప్రభుత్వం సూచించే కంది, పత్తి దీర్ఘకాలిక పంటలు కావడం, ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో రెండు పంటలు వేసుకోవడానికి అవకాశం ఉం డదని చెబుతున్నారు. రైతుబంధు ఇవ్వకపోయినా మొక్కజొన్నను వేసి తీ రుతామని కొందరు చెబుతున్నారు. దీర్ఘకాలిక పంటల వల్ల దిగుబడి త క్కువ రావడంతోపాటు, రెండో పంటను కోల్పోతామని పేర్కొంటున్నారు. మొక్కజొన్న కోసం భూమిని కౌలుకు తీసుకుని, రెండు పంటలు సాగు చే యవచ్చనుకునే కౌలు రైతులకు దీర్ఘకాలిక పంటల వల్ల నష్టం వాటిల్లే అ వకాశాలు ఉన్నాయి.


నాలుగు లక్షల ఎకరాల్లో సాగు పెంపు

ఉమ్మడి జిల్లాలో గత సంవత్సరం 15 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఈ ఏడు దాదాపు నాలుగు లక్షలు పెరిగి 19.89 లక్షల ఎ కరాల్లో వానాకాలం పంటల సాగుకు అధికారులు ప్రణాళిక రచించారు. వ ర్షాధారంగా వేసే పంటల్లో పత్తి, కంది, ఆముదం పంటలు ఉండగా, 9.50 లక్షల ఎకరాల వాటా పత్తిదేనని చెప్పవచ్చు. పత్తి అత్యంత ఎక్కువగా నా గర్‌కర్నూలు జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించి, అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 10 వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేయను న్నారు. కంది పంట ఒక్క నారాయణపేట జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో సాగు చేపడుతుండగా, వనపర్తిలో 50 వేలు, మహబూబ్‌నగర్‌లో 67,200, నాగర్‌కర్నూలు, గద్వాల జిల్లాలో దాదాపు 45 వేల ఎకరాల్లో చేపట్టనున్నా రు. వరి సాగు వానాకాలంలో గతేడాది కంటే 2.10 లక్షల ఎకరాలు పెరగ నుంది. సన్నరకాలు సగం కంటే ఎక్కువగా సాగు చేయాలని సూచిస్తున్నా, వానాకాలంలో విస్తీర్ణం తగ్గించకుండా పెంచడం విశేషం. ఆముదం సాగు ను గతేడాది కంటే ఉమ్మడి జిల్లాలో దాదాపు 30 వేలకు పైనే పెంచారు. వానాకాలంలో 88,570 ఎకరాల్లో పంటను సాగు చేయనున్నారు. ఖరీఫ్‌ ప్ర ణాళిక ప్రకారం సాగు విస్తీర్ణం పెరిగింది. ఇప్పటికే అన్ని జిల్లాలో పంటల సాగుకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయి.

Updated Date - 2020-06-04T09:58:43+05:30 IST