కరోనా జోరు....ప్రజలు బేజారు

ABN , First Publish Date - 2020-08-04T10:22:56+05:30 IST

జిల్లాలో కరోనా జోరుకు ప్రజలు విలవిల్లాడు తున్నారు. సీజనల్‌లో భాగంగా జలుబు, జ్వరం వచ్చినా వణికిపోతున్నారు

కరోనా జోరు....ప్రజలు బేజారు

జిల్లాలో వేగంగా పెరుగుతున్న  వైరస్‌

ప్రభుత్వాసుపత్రి వైద్యుడికి పాజిటివ్‌ ఫ తాజాగా మరో 29  


మంచిర్యాల టౌన్‌, ఆగస్టు 3: జిల్లాలో కరోనా జోరుకు ప్రజలు విలవిల్లాడు తున్నారు. సీజనల్‌లో భాగంగా జలుబు, జ్వరం వచ్చినా వణికిపోతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పీహెచ్‌సీల్లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమా నితులకు పరీక్షలు నిర్వహిస్తుండడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కో రోజు 50కి పైగా కేసులు నమోదవుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు 448 యాక్టివ్‌ కేసులు ఉండగా, 283 మంది వ్యాధి బారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అయితే పాజిటివ్‌ కేసుల సంఖ్య 150 నుంచి 200 వరకు అదనంగా ఉంటాయని తెలుస్తోంది. బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌లో ప్రస్తుతం 37 మంది చికిత్స పొందుతు న్నారు. జిల్లా కేంద్రంలోని 5వ వార్డు లక్ష్మీనగర్‌ కాలనీలో ఓ వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. 


జిల్లాలో 29 పాజిటివ్‌ కేసులు

జిల్లా వ్యాప్తంగా సోమవారం 29 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరో గ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితోపాటు పీహెచ్‌సీల్లో మొత్తం 83మందికి పరీక్షలు నిర్వహించగా 29 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వారి ఆరోగ్య స్థితిగతులను బట్టి  హోంక్వారైంటన్‌, బెల్లంపల్లి  ఐసోలే షన్‌కు తరలించారు. కాగా, బెల్లంపల్లి ఐసోలేషన్‌ సెంటర్‌లో పరీక్షలను నిలిపివేశా రు. పాజిటివ్‌ వ్యక్తులకు చికిత్స అందిస్తున్నందున పరీక్షలను రద్దుచేశారు.


పెరుగుతున్న మరణాలు...

కరోనా వ్యాధి బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. చెన్నూరు మండలం ముత్తెరావుపల్లిలో మృతితో కలిపి ఇప్పటి వరకు 10 మరణాలు నమో దయ్యాయి. నస్పూర్‌లో సింగరేణి రిటైర్డ్‌ కార్మికునితోపాటు ఓ యువతి మరణించా రు. శ్రీరాంపూర్‌లో రిటైర్డ్‌ కార్మికుడు, కార్మికుని కొడుకు, మరో రిటైర్డ్‌ కార్మికుని భార్య మృతి చెందారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో ఓ వృద్ధుడు, లక్షెట్టిపేట మండలం ఇటిక్యాలలో సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు, బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలు, మందమర్రి మారుతినగర్‌కు చెందిన ఓ వృద్ధుడు మృతి చెందాడు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో ఓ వ్యాపారి బెల్లంపల్లి ఐసోలేషన్‌ నుంచి హైద్రా బాద్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఇతనికి సంబంధిం చి రిపోర్టులు రావాల్సి ఉంది.


ప్రభుత్వాసుపత్రి వైద్యుడికి వైరస్‌

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేసే వైద్యు డికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆ విభాగంలో పనిచేసే ఇతర వైద్యులు, సిబ్బందిలో ఆందోళన మొదలైంది. ఇప్పటి దాకా ఆసుపత్రి ఆవరణలోని 108 సిబ్బంది గదిలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, వైద్యునికి వైరస్‌ సోకడంతో పరీక్షా కేంద్రాన్ని  మరో చోటికి మార్చారు. కొందరు సిబ్బంది హోంక్వారంటైన్‌కు వెళ్లినట్లు సమాచారం. 


నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు... కలెక్టర్‌ 

జిల్లాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ భారతిహోళికేరి సూచించారు. ఆదివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు తప్పని సరిగా మాస్కులు ధరించడం తోపాటు భౌతికదూరం పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

Updated Date - 2020-08-04T10:22:56+05:30 IST